ప్రముఖ నటుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి.. వీడియో వైరల్‌

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా నటించిన 'ఖలేజా' మువీతోపాటు హిందీలో జోధా అక్బర్‌, విస్రా, ఇక్‌కుడి పంజాబ్ డి, జాట్ బాయ్స్ పూత్ జట్టన్ డి, అనంత్ ది ఎండ్ తదితర సినిమాల్లో నటించిన అమన్‌ ధాలివాల్‌ (36) ప్రేక్షకులకు సుపరిచితమే. తాజాగా అమెరికాలోని..

ప్రముఖ నటుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి.. వీడియో వైరల్‌
Aman Dhaliwal
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Mar 17, 2023 | 8:18 PM

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా నటించిన ‘ఖలేజా’ మువీతోపాటు హిందీలో జోధా అక్బర్‌, విస్రా, ఇక్‌కుడి పంజాబ్ డి, జాట్ బాయ్స్ పూత్ జట్టన్ డి, అనంత్ ది ఎండ్ తదితర సినిమాల్లో నటించిన అమన్‌ ధాలివాల్‌ (36) ప్రేక్షకులకు సుపరిచితమే. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఓ జిమ్‌లో నటుడు అమన్‌ ధాలివాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలొ అమన్‌ మెడ, తల, ఛాతీ, భుజం, చేతులపై తీవ్రంగా కత్తి గాట్లతో రక్త స్రావం అవ్వడంతో జిమ్‌ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

తాగడానికి నీళ్లు కావాలంటూ జిమ్‌కు వచ్చిన ఓ అగంతకుడు అరుస్తాడు. ఆ తర్వాత జిమ్‌లో ఉన్న ఇతర వ్యక్తులపై పెద్దగా అరుస్తాడు. అతని వెనుక ఉన్న అమన్‌ అతన్ని పట్టుకోబోతాడు. ఇంతలో అతని చేతిలో ఉన్న కత్తితో అమన్‌పై దాడి చేయడంతో ఇద్దరు కిందపడిపోతారు. ఈ ఘర్షణలో అమన్‌ గాయాలపాలై రక్తసిక్తమవ్వడం వీడియోలో చూడవచ్చు. వెంటనే అప్రమత్తమైన జిబ్‌ సిబ్బంది అంగతకుడిని నేలపై బంధించి పట్టుకుని పోలీసులకు అప్పగించడం వీడియోల చూడవచ్చు. కాలిఫోర్నియాలోని గ్రాండ్ ఓక్స్‌లోని జిమ్‌ల గొలుసు ప్లానెట్ ఫిట్‌నెస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అమన్‌పై ఆగంతకుడు దాడి చేసిన దృశ్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం అమన్‌ ఆరోగ్యంగానే ఉన్నట్లు, గాయాలకు కట్టుగట్టుకుని ఉన్న ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేస్తూ తెలిపారు. మోడలింగ్‌తోపాటు పలు టీవీ షోలు, హాలీవుడ్ సినిమాల్లో కూడా అమన్‌ నటించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.