AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: జరిమానా కట్టమన్నందుకు రవాణా అధికారిపై కొబ్బరి బోండాల వ్యాపారి కత్తితో దాడి

జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన..

AP News: జరిమానా కట్టమన్నందుకు రవాణా అధికారిపై కొబ్బరి బోండాల వ్యాపారి కత్తితో దాడి
Coconut Vendor
Srilakshmi C
|

Updated on: Mar 17, 2023 | 3:22 PM

Share

జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన కాకినాడలో శుక్రవారం (మార్చి 17) ఉదయం చోటుచేసుకుంది. దాడిలో అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నగరంలో దేవాదాయ శాఖ కార్యాలయం సమీపంలోని జెడ్పీ సెంటర్‌ వద్ద పెంటా వెంకట దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి వ్యాన్‌ను నిలిపి కొబ్బరి బోండాలు అమ్ముతున్నాడు. అటుగా వచ్చిన అసిస్టెంట్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం చిన్నారావు వ్యాన్‌కు సంబంధించిన పత్రాలు చూపమని కోరాడు. తనిఖీల నిమిత్తం వ్యాన్‌ రికార్డులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌ పత్రాలు చూపాలని, వాహనానికి ఇది వరకే పడిన ఫైన్‌ కట్టాలని ఇన్‌స్పెక్టర్‌ సూచించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన దుర్గాప్రసాద్‌ తన వద్ద ఉన్న కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో ఇన్‌స్పెక్టర్‌ చిన్నారావుపై దాడి చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపైనా దాడికి దిగడంతో ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం విరమించుకున్నారు. ఈ ఘటనలో రవాణా శాఖ అధికారి చేతి బొటనవేలు తెగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇన్‌స్పెక్టర్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడు దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగిందని, ప్రస్తుతం ప్రస్తుతం చిన్నారావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు