AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పైలెట్ ట్యాలెంట్‌కు హ్యాండ్సాఫ్‌..! హెలిప్యాడ్‌పై బుల్లి విమానాన్ని ఎలా ల్యాండ్ చేశాడో చూడండి..

విమానం ల్యాండ్‌ అవ్వడం ఎప్పుడైనా చూశారా..? ఆకాశం నుంచి నేలపై వాలే సమయంలో వేగంగా నేలకు రాపిడి చేసుకుంటూ అల్లంతదూరం వెళ్లిమరీ ఆగుతుంది. ప్రపంచంలో ఏ దేశ విమానం అయినా దాదాపు ఇలానే నేలపై..

Watch Video: పైలెట్ ట్యాలెంట్‌కు హ్యాండ్సాఫ్‌..! హెలిప్యాడ్‌పై బుల్లి విమానాన్ని ఎలా ల్యాండ్ చేశాడో చూడండి..
Pilot Lands Plane On Helipa
Srilakshmi C
|

Updated on: Mar 16, 2023 | 5:09 PM

Share

విమానం ల్యాండ్‌ అవ్వడం ఎప్పుడైనా చూశారా..? ఆకాశం నుంచి నేలపై వాలే సమయంలో వేగంగా నేలకు రాపిడి చేసుకుంటూ అల్లంతదూరం వెళ్లిమరీ ఆగుతుంది. ప్రపంచంలో ఏ దేశ విమానం అయినా దాదాపు ఇలానే నేలపై ల్యాండ్‌ అవుతుంది. ఐతే ఓ పైలెట్‌ మాత్రం కేవలం 20 మీటర్ల దూరంలోనే హెలీపాడ్‌పై విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేసి అందరితో వావ్‌..! అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ విమానం ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మీరూ ఓ లుక్కేసుకోండి..

దుబాయ్‌లోని ప్రముఖ లగ్జరీ హోటల్ ‘బుర్జ్ అల్ అరబ్’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విలాసవంతమైన ఈ హోటల్‌పైన 27 మీటర్ల హెలిప్యాడ్‌ కూడా ఉంది. ఇది భూమి నుంచి 212 మీటర్ల ఎత్తులో హోటల్‌ పై భాగాన ఉంది. సాధారణంగా హెలిప్యాడ్‌పై హెలిక్యాఫ్టర్లు ల్యాండ్‌ అవుతుంటాయి. ఐతే చరిత్రలో మొదటిసారి పోలిష్ పైలట్, మాజీ రెడ్ బుల్ ఎయిర్ రేస్ ఛాలెంజర్ క్లాస్ వరల్డ్ ఛాంపియన్ అయిన ‘ల్యూక్ చెపిలా’ 27 మీటర్ల హెలీప్యాడ్‌పై కేవలం 20.76 మీటర్ల దూరంలోనే మినీ విమానాన్ని ల్యాండ్‌ చేయడం విశేషం. ఈ స్టంట్‌ కోసం అతను రెండేళ్లపాటు శిక్షణ కూడా తీసకున్నాడట. చెపిలా చేసిన ఈ అద్భుతమైన విమాన ల్యాండింగ్‌ స్టంట్‌ వీడియో చూస్తే దాదాపు గుండె ఆగిపోయినంత పనవుతుంది. ‘గతంలో రెండు సార్లు తక్కువ స్థలంలో విమానం ల్యాండ్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యానని, మూడో ప్రయత్నంలో విజయవంతంగా హెలిప్యాడ్‌పై ల్యాండ్‌ చేయగలిగానని చెపిలా మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను రెడ్‌ బుల్‌ మోటర్‌ స్పోర్ట్స్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్‌, లక్షల్లో లైకులు, కామెంట్లు రావడంతో సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Red Bull (@redbull)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.