కట్నంగా ట్రాక్టర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసిన వరుడు.. ! వధువు చేసిన పనితో శరణు శరణంటూ…

తమ అమ్మాయి పెళ్లి కోసమని ఫర్నీచర్‌, ఫ్రిజ్‌, ఇతర గృహోపకరణాల కోసం లక్షలు వెచ్చించామని చెప్పాడు. నాలుగు రోజుల క్రితమే అన్నీ వరుడి ఇంటికి డెలివరీ చేశారు. ఇదిలావుండగా మళ్లీ ట్రాక్టర్ ఇవ్వాలని వరుడు డిమాండ్ చేశాడు..

కట్నంగా ట్రాక్టర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసిన వరుడు.. ! వధువు చేసిన పనితో శరణు శరణంటూ...
Marriage
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 16, 2023 | 3:50 PM

కాలం మారింది. ప్రజలు విద్యావంతులుగా మారారు.. కానీ, కొన్ని విషయాల్లో పాత పద్ధతులు, సంప్రదాయాలను మాత్రం నేటికీ కొనసాగిస్తున్నారు. అందులో ఒకటి వర కట్నం. ఎంతటి ధనవంతులైనా సరే, పెళ్లి సందర్భంగా ఆడపిల్ల ఇంటినుంచి కట్నం అడగడం మాత్రమే వదిలిపెట్టరు. వధువు పుట్టింటి వారి నుంచి నగదు,నగలు, ఆస్తులు, కార్లు, ఇతర వస్తువులు డిమాండ్ చేస్తారు. ఇలాంటి క్రమంలోనే ఖరీదైన కట్నం అడిగిన పెళ్లికొడుక్కి.. పెళ్లికూతురు, ఆమె కుటుంబసభ్యులు, గ్రామస్తులతో గట్టిగా బుద్ధి చెప్పిన ఘటన అందరినీ ఆలోచింపజేసింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకున్న ఈ అరుదైన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

దేశంలో వరకట్నం చట్టవిరుద్ధం. శిక్షార్హమైన నేరం అయినప్పటికీ, పెళ్లి సమయంలో వరుడి కుటుంబం వధువు కుటుంబం నుండి నగదు, ఇతర విలువైన వస్తువులను కోరడం సర్వసాధారణం. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఒక వరుడు తనకు కట్నంగా ట్రాక్టర్ ఇవ్వాలని వధువు కుటుంబసభ్యులను కోరాడు. అదే శరతు మేరకు బంధువులతో కలసి కళ్యాణ మండపానికి వచ్చారు. ఈ సందర్భంలో, వధువు తరపున వారంతా కలిసి వరుడు, అతని కుటుంబాన్ని బంధించారు. కొత్త ట్రాక్టర్‌ ఏర్పాటు చేసి పెళ్లికూతురుకు బదులుగా ట్రాక్టర్‌తోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. దాంతో దెబ్బకు దిగి వచ్చిన అబ్బాయి తరపు వాళ్లు.. పెళ్లిని రద్దు చేసుకున్నారు. పైగా పెళ్లి కోసం చేసిన ఖర్చులు కూడా చెల్లిస్తామని అంగీకరించారు. అలా కొన్ని గంటల తర్వాత వారిని విడిపించి పంపించారు.

పెళ్లికూతురు మేనమామ మహ్మద్‌ మాట్లాడుతూ.. ‘తమ అమ్మాయి పెళ్లి కోసమని ఫర్నీచర్‌, ఫ్రిజ్‌, ఇతర గృహోపకరణాల కోసం లక్షలు వెచ్చించామని చెప్పాడు. నాలుగు రోజుల క్రితమే అన్నీ వరుడి ఇంటికి డెలివరీ చేశారు. ఇదిలావుండగా మళ్లీ ట్రాక్టర్ ఇవ్వాలని వరుడు డిమాండ్ చేశాడని చెప్పారు. వరుడి డిమాండ్ గురించి తెలుసుకున్న వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. అంతేకాదు వరకట్నం కోరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని వధువు తేల్చి చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..