Viral Video: వావ్..! పైనాపిల్‌ను కోయడం ఇంత తేలికనా..? ఇంతకాలం ఎంత శ్రమపడ్డాం..!

ఆస్తమాతో సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో పైనాపిల్ రసం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే, పైనాపిల్‌ని కట్‌ చేయడం అందరికీ అంత సులువుగా రాదు. కొన్ని టిప్స్‌ ప్రకారం కట్‌ చేస్తే ఈజీగా కట్‌ చేయచ్చు.

Viral Video: వావ్..! పైనాపిల్‌ను కోయడం ఇంత తేలికనా..? ఇంతకాలం ఎంత శ్రమపడ్డాం..!
Pineapple
Follow us

|

Updated on: Mar 16, 2023 | 1:32 PM

పైనాపిల్‌ జ్యూస్‌ను చాలా మంది ఇష్టపడతారు. పైనాపిల్‌ పండులో కమ్మటి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. పైనాపిల్‌లో విటమిన్‌ బీ, సీతో పాటు పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు కూడా అందిస్తుంది. అయితే, పైనాపిల్‌ని కట్‌ చేయడం అందరికీ అంత సులువుగా రాదు. కొన్ని టిప్స్‌ ప్రకారం కట్‌ చేస్తే ఈజీగా కట్‌ చేయచ్చు. పైనాపిల్‌ పండును ఇజీగా కట్‌ చేసుకోవడం ఎలాగో సోషల్ మీడియాలో కొత్త టెక్నిక్‌లు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మీ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించాడు. పైనాపిల్‌ను సులభంగా కోయడం ఎలాగో వివరించారు. Instagram foodiechina888 ఖాతాలో ఒక వీడియో షేర్ చేయబడింది.

ఈ వీడియో ప్రకారం పైనాపిల్ కోయడానికి పెద్ద ఆయుధం ఏదీ అవసరం లేదు. ఒక పదునైన కత్తి ఉంటే సరిపోతుంది. గుజ్జు, పై తొక్క కోసే పనికూడా లేదు. ఈ వీడియోకు 20 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ లభించాయి. ఈ రీల్‌ను ఒక వీడియో సృష్టికర్త అతని పేజీ @foodiechina888లో పోస్ట్ చేశారు. ఈ “ఫూల్‌ప్రూఫ్ ట్రిక్” చైనాలో బాగా ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Wayne Shen (@foodiechina888)

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది సరదాగా మాత్రమే కాకుండా పండ్లను కత్తిరించడానికి ఉపయోగకరమైన మార్గం అని చాలా మంది అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు నేను పైనాపిల్స్ కోయడం చాలా వృధా చేశాను” అని ఒకరు రాశారు. పండ్ల గుజ్జు తినడం సరైనదేనా అని మరొకరు ప్రశ్నించారు. ఇలా పండు తింటున్నప్పుడు పైనాపిల్ ముల్లు పెదవులకి గుచ్చుతుంది కానీ ఈ పద్దతి నాకు చాలా ఇష్టం. నొప్పి లేకుండా లాభం లేదని రాశారు.

తదుపరిసారి నేను పైనాపిల్ కొనుగోలు చేస్తే, నేను ప్రయత్నిస్తాను, మరొక వినియోగదారు రాశారు. ఇక నుంచి ఈ ట్రిక్ ఫాలో చేస్తానని మరొకరు రాశారు. మీరు దానిని ఎలా కత్తిరించినా, పైనాపిల్ వినియోగం మాత్రమే ఆరోగ్యానికి చాలా మందిది. పైనాపిల్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పైనాపిల్ రసంలో ముఖ్యంగా మాంగనీస్, కాపర్, విటమిన్ బి6, సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి సహాయపడతాయి. ఇది గాయాన్ని నయం చేస్తుంది. ఇది మన శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కోలిన్, విటమిన్లు కె, బి కూడా ఉన్నాయి.

పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. హానికరమైన, అతిసారం కలిగించే బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు క్యాన్సర్ నుండి మనలను రక్షిస్తుంది. ఆస్తమాతో సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో పైనాపిల్ రసం కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..