AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: చికాగోలో చిక్కుకుపోయిన ఎయిర్ ఇండియా ప్రయాణికులు.. దాదాపు 24 గంటలకు పైగా పడిగాపులు

మా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. సాంకేతిక కారణాల వల్ల 2022లో మొత్తం 1,171, 2021లో 931, 2020లో 1,481 విమానాలు రద్దు చేసినట్లు ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది.

Air India: చికాగోలో చిక్కుకుపోయిన ఎయిర్ ఇండియా ప్రయాణికులు.. దాదాపు 24 గంటలకు పైగా పడిగాపులు
Air India
Jyothi Gadda
|

Updated on: Mar 16, 2023 | 12:58 PM

Share

ఎయిర్ ఇండియా విమానంలో మరోసారి సాంకేతిక సమస్యలు తల్లెత్తాయి. న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు కావడంతో దాదాపు 300 మంది ప్రయాణికులు అమెరికాలోని చికాగోలో చిక్కుకుపోయారు. ఢిల్లీకి విమానంలో ఎప్పుడు ఎక్కుతారనే దానిపై ఇంకా స్పష్టత లేదని కొందరు ప్రయాణికులు వాపోతున్నారు. వాస్తవానికి ఎయిర్ ఇండియాకు చెందిన విమానం చికాగో ఓహరే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బయలుదేరి మార్చి 15న మధ్యాహ్నం 2:20 గంటలకు ఢిల్లీలో దిగాల్సి ఉంది. కానీ, విమానం రద్దు కావడంతో ప్రయాణీకులు దాదాపు 24 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.

విమానం రద్దు నేపథ్యంలో ప్రయాణీకులు దాదాపు 24 గంటలు వేచి ఉన్నారు. మాకు సమాధానం ఇవ్వడానికి ఇప్పటికీ ఎయిర్‌లైన్ నుండి సమాధానం లేదంటూ ఈ విమానంలో బుక్ చేసిన ప్రయాణీకుడు గోపాల్ కృష్ణ సోలంకి రాధాస్వామి అన్నారు. దాదాపు 24 గంటల పాటు ఎయిర్‌పోర్టులో వేచి ఉన్నామని, ఢిల్లీకి విమానంలో ఎప్పుడు ఎక్కుతారో కూడా తెలియడం లేదని మరో ప్రయాణికుడు చెప్పారు. విదేశీయులతో సహా 300 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారని ఇద్దరు వ్యక్తులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్ ఇండియా ప్రతినిధిని సంప్రదించినప్పుడు, సాంకేతిక కారణాల వల్ల ఫ్లైట్ నంబర్ AI 126 మార్చి 14 న రద్దు చేయబడిందని చెప్పారు. బాధిత ప్రయాణికులకు అన్ని సహాయాలు అందిస్తున్నామని, ప్రత్యామ్నాయ విమానాల్లో వారిని పంపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. సాంకేతిక కారణాల వల్ల 2022లో మొత్తం 1,171, 2021లో 931, 2020లో 1,481 విమానాలు రద్దు చేసినట్లు ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..