UP: ప్లకార్డుతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బైక్ దొంగ.. ఏమని రాసుకొచ్చాడో తెలుసా!

Bike thief surrenders in Muzaffarnagar: ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 వేలకు పైగా ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. వీటిలో దాదాపు 160 మంది అనుమానిత నేరస్థులు హతమయ్యారు.

UP: ప్లకార్డుతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బైక్ దొంగ.. ఏమని రాసుకొచ్చాడో తెలుసా!
Bike Thief
Follow us

|

Updated on: Mar 16, 2023 | 12:47 PM

మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలమైతే పరిస్థితి ఏమిటీ..? ఇదే పరిస్థితి ఓ దొంగ ఎదుర్కొన్నాడు. అతనో దొంగ.. చేసిందీ కూడా మరీ పెద్ద దోపిడీలు కూడా ఏమీ కాదు. జస్ట్ ఒంటరిగా కనిపించే బైకులను మాత్రమే కొట్టేశాడు. అతను దొరక్కుండా పారిపోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి నేరుగా పోలీస్ స్టేషన్‌కే వచ్చి లొంగిపోయాడు. ఓ సినిమా సీన్ తరహాలో జరిగిన ఈ సీన్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగింది.

మన్సూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌‌కు ఓ వ్యక్తి చేతిలో ప్లకార్డుతో నేరుగా వచ్చాడు. తన పేరు అంకుర్‌ అని బైక్ దొంగతనాలు చేస్తానని.. ఇకపై చేయను లొంగిపోతానంటూ వచ్చాడు. నన్ను క్షమించండి, యోగీ జీ, నేను తప్పు చేశాను.. మారాలనుకుంటానంటూ ఫ్లకార్డుపై రాసుకుని మరీ వచ్చాడు. అతన్ని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. వెతకబోయిన తీగ కాలికి తగినట్లైంది పోలీసుల పరిస్థితి. చివరికి అతగాడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

గత కొన్నిరోజులు ఉత్తరప్రదేశ్‌లో నేరస్థుల పాలిట సింహాస్వప్నంగా మారారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. నేరం చేసిన వారిపై కఠినంగా వ్యవహారించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుల్డోజర్ ప్లాన్‌తో అధికారులు సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అంకుర్ అనే వాహనాల దొంగ.. ఎన్‌కౌంటర్ జరుగుతుందనే భయంతో పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. అతను పోలీసులకు క్షమాపణలు చెప్పాడు. ఇకపై నేరం చేయనని తేల్చిచెప్పాడు. దీంతో అతడిని అరెస్టు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రజత్ త్యాగి తెలిపారు. నిందితుడిపై గతంలో హత్యాయత్నం, దోపిడీ సహా అనేక కేసులలో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. కాగా పేరుమోసిన ముఠాలోని ఇద్దరు సభ్యులను మంగళవారం అరెస్టు చేశామని జిల్లా డిప్యూటీ ఎస్పీ చెప్పారు. నిందితుల్లో ఒకరు తప్పించుకోగలిగారు. పట్టుబడిన వారి నుంచి మూడు బైక్‌లు, ఇతర అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఖటౌలీ డీఎస్పీ రవిశంకర్ మిశ్రా వెల్లడించారు.

పోలీసు రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 వేలకు పైగా ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. వీటిలో దాదాపు 160 మంది అనుమానిత నేరస్థులు హతమయ్యారు. యూపిలోని నేరస్థులలో యోగి పరిపాలన భయం చాలా బలంగా ఉంది. నేరస్థుల లొంగిపోయే కొత్త కేసులు తెరపైకి వస్తున్నాయి. గతేడాది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రేటింగ్‌లో యూపిని సురక్షితమైన రాష్ట్రంగా పేర్కొనడం విశేషం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుపరిపాలన కారణంగా ఉత్తరప్రదేశ్ మాఫియా పాలనను వదిలించుకుని అభివృద్ధికి కొత్త నిర్వచనాన్ని సృష్టిస్తోందని భారతీయ జనతా పార్టీ అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..