ఆన్‌లైన్‌లో బాస‌ర‌ అమ్మవారి ఆలయ సేవలు.. ఇ- హుండీ సేవ‌ల‌ను ప్రారంభించిన మంత్రి అల్లోల..

అదే విధంగా ఇ- హుండీ సేవ‌ల‌ను కూడా భ‌క్తుల‌కు అందుబాటులోకి తెచ్చామ‌ని, డిజిట‌ల్ క‌రెన్సీ వినియోగం పెరిగినందు వ‌ల్ల భ‌క్తుల సౌక‌ర్యార్ధం ఈ స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. పేటీయం, ఫోన్ పే, జీ పే లాంటి యూపీఐల ద్వారా హుండీ కానుక‌లు చెల్లించ‌వ‌చ్చన్నారు.

ఆన్‌లైన్‌లో బాస‌ర‌ అమ్మవారి ఆలయ సేవలు.. ఇ- హుండీ సేవ‌ల‌ను ప్రారంభించిన మంత్రి అల్లోల..
Basara Temple Online Servic
Follow us

|

Updated on: Mar 14, 2023 | 8:30 PM

ఆన్‌లైన్‌లో చదువుల తల్లి సరస్వతి అమ్మవారి పూజలు అందుబాటులోకి వచ్చాయి. నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి దేవాలయంలో ఆన్ లైన్ సేవలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఆన్ లైన్ లో బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ, ఇ- హుండీ సేవలను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంతోపాటు వారి సౌక‌ర్యార్ధం ప్రధాన ఆల‌యాల్లో ఆన్‌లైన్‌లో పూజలు, వ‌స‌తి బుకింగ్, ప్రసాదం పంపిణీ, త‌దిత‌ర‌ సేవ‌లను భ‌క్తులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

ఆన్ లైన్ సేవ‌ల‌ వల్ల అమ్మవారి సేవ‌ల‌ను పార‌ద‌ర్శకంగా, సుల‌భంగా పొంద‌గ‌లుగుతారని చెప్పారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి. భక్తులకు సేవలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి బాస‌ర‌లో ఆన్ లైన్ సేవ‌లు భ‌క్తులకు అందుబాటులోకి వ‌చ్చే విధంగా అధికారుల చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని తెలిపారు. అదే విధంగా ఇ- హుండీ సేవ‌ల‌ను కూడా భ‌క్తుల‌కు అందుబాటులోకి తెచ్చామ‌ని, డిజిట‌ల్ క‌రెన్సీ వినియోగం పెరిగినందు వ‌ల్ల భ‌క్తుల సౌక‌ర్యార్ధం ఈ స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. పేటీయం, ఫోన్ పే, జీ పే లాంటి యూపీఐల ద్వారా హుండీ కానుక‌లు చెల్లించ‌వ‌చ్చన్నారు.

అంత‌కు ముందు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బాసర సరస్వతీ అమ్మవారి ని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. మంత్రికి ఆల‌య అర్చ‌కులు, అధికారులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఆల‌య ఈవో విజ‌య రామారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం…

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!