AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Paper Leak: పది లక్షలకు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నాడు.. పేపర్ లీక్‌పై TSPSC చైర్మన్ ఏమన్నారంటే..?

పేపర్ లీక్ వ్యవహారంపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 'గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ పై అందరూ ప్రశంసించారు. పారదర్శకంగా నియామకాల ప్రక్రియలో ఎలాంటి రాజీ లేదు

TSPSC Paper Leak: పది లక్షలకు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నాడు.. పేపర్ లీక్‌పై TSPSC చైర్మన్ ఏమన్నారంటే..?
Janardhan Reddy
Basha Shek
|

Updated on: Mar 14, 2023 | 8:16 PM

Share

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో లీకుల బాగోతం…లక్షలాది ఉద్యోగ అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. నిరుద్యోగుల జీవితాల్లో ప్రకంపనలు రేపిన పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం తెలంగాణలో అగ్గిరాజేసింది. TSPSC పేపర్‌ లీక్‌ వ్యవహారం తెలంగాణ సర్కార్‌ను కుదిపేస్తోంది. పేపర్ల లీక్‌లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంతో మరిన్ని ఎగ్జామ్ పేపర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అటు.. పేపర్‌ లీక్‌ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ.. హైదరాబాద్‌ సీపీ CV ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పేపర్ లీక్ వ్యవహారంపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ పై అందరూ ప్రశంసించారు. పారదర్శకంగా నియామకాల ప్రక్రియలో ఎలాంటి రాజీ లేదు . ఏడాది లో మొత్తం 27 నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇప్పటికే 7 ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. ఈ నెల 11వ తేదీన డేటా బయటికి వెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాం. రాజశేఖర్ రెడ్డి అని నెట్‌వర్క్ ఎక్స్ పర్ట్ ఏడేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాడు. అతని నైపుణ్యంతో ఇతర కంప్యూటర్ ల డేటా యాక్సిస్ చేసినట్లు తెలిసింది. ప్రవీణ్ అనే మరో ఉద్యోగితో కలిసి పేపర్ లీకేజీ చేశారు. పోలీసుల నుంచి అఫిషియల్ రిపోర్ట్ వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటాం’

ప్రవీణ్‌ పేపర్‌ హ్యాక్‌ చేసినట్లు గుర్తించాం. అతను ప్రశ్నాపత్రాన్ని పది లక్షలకు అమ్ముకున్నాడు. దీనిపై రేపు 3గంటలకు అధికారిక నివేదిక అందుతుంది. ఆ నివేదిక ఆధారంగా AE పరీక్ష రద్దు చేయాలా వద్దా అని నిర్ణయిస్తాం. ప్రవీణ్‌, రాజశేఖర్‌ కలిసి పేపర్‌ లీక్‌ చేశారు. దర్యాప్తు నివేదిక వచ్చాక, న్యాయ నిపుణులతో మాట్లాడి రద్దుపై నిర్ణయం తీసుకుంటాం’ అని జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగుతున్నారా..?ఇది తెలిస్తే
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగుతున్నారా..?ఇది తెలిస్తే
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే