AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spicejet: కాక్‌పిట్‌లో చేయకూడని పనులు చేసిన పైలెట్లు.. మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చిన అధికారులు..

పోటోలు షేర్‌ చేసిన యూజర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను సహించరాదని పేర్కొన్నారు. ఫోటో వైరల్ కావడంతో స్పైస్‌జెట్ వెంటనే సంబంధిత పైలట్‌లపై చర్యలు తీసుకుంది.

Spicejet: కాక్‌పిట్‌లో చేయకూడని పనులు చేసిన పైలెట్లు..  మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చిన అధికారులు..
Spicejet Flight
Jyothi Gadda
|

Updated on: Mar 16, 2023 | 3:20 PM

Share

విమానయాన సంస్థ దురుసు ప్రవర్తన ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తోంది. విమానంలో పక్క సీటులో కూర్చున్న మహిళపై వ్యాపారవేత్త మూత్ర విసర్జన చేసిన ఉదంతం మరువక ముందే, మరో ప్రయాణికురాలి దురుసుగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడిని విమానం నుంచి దింపివేసి ప్రయాణం కొనసాగించింది. స్పైస్ జెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తాజాగా స్పైస్‌ జెట్‌ విమానంలో మరో నిర్లక్ష్యానికి సంబంధించిన ఘటన ఇప్పుడు వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

విమానం కాక్‌పిట్ అత్యంత సున్నితమైన, క్లిష్టమైన ప్రదేశం.. కాబట్టి, ఇక్కడకు ప్రయాణికులకు ప్రవేశం లేదు.. అంతే కాకుండా ఎలాంటి లిక్విడ్‌తో సహా ఆహార పదార్థాలను ఇక్కడ అస్సలు ఉంచకూడదు. ఇది భద్రతా నియమం.యు విమానం పైలట్‌తో సహా ప్రతి ఒక్కరికీ ఈ సున్నితత్వం గురించి తెలుసు. కానీ, అలాంటి కాక్‌పిట్‌లో సమోసాలు తిని, మద్యం సేవించి భద్రతా నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టిన స్పైస్ జెట్ పైలట్‌లిద్దరిపై వేటు పటింది. ఆ ఇద్దరు పైలట్లను ప్రస్తుతానికి విధుల నుంచి సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి
Flight Cockpit

Flight Cockpit

ఈ ఘటనపై స్పైస్ ఎయిర్‌జెట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాక్‌పిట్‌లో కూర్చొని భోజనం చేసే విషయంలో క్రమశిక్షణా నియమాలు ఉన్నాయని అన్నారు. విమాన సిబ్బంది అందరూ దీనిని పాటిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాక్‌పిట్‌లో సమోసా, డ్రింక్‌ తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోటోలు షేర్‌ చేసిన యూజర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను సహించరాదని పేర్కొన్నారు. ఫోటో వైరల్ కావడంతో స్పైస్‌జెట్ వెంటనే సంబంధిత పైలట్‌లపై చర్యలు తీసుకుంది. ఎల్లప్పుడూ భద్రతా విధానాలను అనుసరించడం ఎంత కీలకమో మరోమారు సిబ్బందికి వార్నింగ్‌ ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..