Organic Plastic: ఆర్గానిక్‌ ప్లాస్టిక్‌.. ఆరోగ్యానికి హానికరం కాదు..! ఎలా తయారు చేస్తారో తెలిస్తే అవాక్కే..!

ఈ ప్లాస్టిక్‌ని చాలా సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు.

Organic Plastic: ఆర్గానిక్‌ ప్లాస్టిక్‌.. ఆరోగ్యానికి హానికరం కాదు..! ఎలా తయారు చేస్తారో తెలిస్తే అవాక్కే..!
Organic Plastic
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 16, 2023 | 4:43 PM

ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు. ప్లాస్టిక్ వల్ల కూడా అనేక వ్యాధులు వస్తున్నాయి. అందువల్ల ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధించింది. మన దైనందిన జీవితంలో, ఆహార పదార్థాల నుండి ఏదైనా వస్తువులను తీసుకెళ్లడానికి ప్లాస్టిక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తాము. కానీ ప్లాస్టిక్‌ని ఎక్కువగా వాడడం వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరం. అయితే వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్శిటీకి చెందిన ఫిజిక్స్ విద్యార్థులు అలాంటి పరిశోధన ఒకటి చేశారు. ఇందులో మనం రోజూ తినే ఆహారం, పానీయాలలో ఉపయోగించే ధాన్యాలు, కూరగాయల పిండి నుండి ఆర్గానిక్‌ ప్లాస్టిక్‌ను తయారు చేశాడు. దాని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు.

బయో ప్లాస్టిక్‌లో ఆర్గానిక్ కలర్‌ని కూడా ఉపయోగించారు.. ఎరుపు రంగు కోసం క్యారెట్, బీట్ రూట్ వంటి దుంపల రంగును ఉపయోగిస్తారు. పసుపు రంగు కోసం పసుపును ఉపయోగించారు. ఈ ప్లాస్టిక్‌ని చాలా సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చని సూరత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్‌ తెలిపారు.. ఔషధాల కోసం వాడేటప్పుడు ఇది ఎక్కువగా క్యాప్సూల్స్‌ కోసం ఉపయోగించవచ్చు. ఈ ప్లాస్టిక్ శరీరంలోకి చేరినా హానికరం కాదు. ఎందుకంటే ఇది కూరగాయలు, ధాన్యాల నుండి మాత్రమే తయారు చేసినట్టుగా వెల్లడించారు.

వీర్ నర్మద్ యూనివర్శిటీలో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఐ.బి.పటేల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాస్టిక్‌లు పీవీసీ, ఇతర పాలిమర్‌లను పోలి ఉంటాయన్నారు. ఇందులో రసాయనాలు ఉంటాయి. ఇది ఆరోగ్యం, పర్యావరణం రెండింటికీ హానికరం. కాబట్టి మా విద్యార్థులు, తాను కలిసి.. మనం తినే కూరగాయలు, ధాన్యాల నుండి పిండి పదార్ధాలను ఉపయోగించి దీన్ని తయారు చేసినట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం…