New Smart Watch : మూడు వందల స్పోర్ట్స్ మోడ్స్‌తో కొత్త స్మార్ట్ వాచ్.. ఏకంగా ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్
కంపెనీలు కూడా పెరుగుతున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్స్‌తో సరికొత్తగా స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ కోవలోనే ఫైర్‌బోల్ట్ కంపెనీ కూడా మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్‌వాచ్ వాడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రత్యేక ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌లు రావడంతో యువత ముఖ్యంగా మహిళలు వాటిని ధరించడానికి ఇష్టపడుతున్నారు. దీంతో కంపెనీలు కూడా పెరుగుతున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్స్‌తో సరికొత్తగా స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ కోవలోనే ఫైర్‌బోల్ట్ కంపెనీ కూడా మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫైర్‌బోల్ట్ ఇన్‌విన్సబుల్ ప్లస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ కచ్చితంగా యువతను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వచ్చే ఈ వాచ్, రౌండ్ డయల్, రొటేటింగ్ క్రౌన్, బ్రష్డ్ మెటల్ బాడీ డిజైన్‌తో ఆకర్షనీయంగా ఉంటుంది.
ధర, లభ్యత
ఫైర్‌బోల్ట్ ఇన్‌విన్సబుల్ ప్లస్ సిలికాన్, స్టెయిన్ లెస్ స్టీల్ ఫినిషింగ్‌తో వస్తుంది. సిలికాన్ వెరియంట్ ధర రూ.3999గా ఉంది. అలాగే డార్క్ గ్రే, బ్లాక్, బ్లాక్ గోల్డ్, రోజ్ గోల్డ్, గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుంది. దీంతో పాటు స్టెయిన్ లెస్ స్టీల్ ఫినిషింగ్‌తో వచ్చే వాచ్ ధర రూ.4,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ వాచ్ బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్, ఫైర్‌బోల్ట్ వెబ్‌సైట్స్ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఫైర్‌బోల్ట్ ఇన్‌విన్సబుల్ ప్లస్ ఫీచర్లు ఇవే
- 1.43 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 460×460 పిక్సెల్ రెజుల్యూషన్
- 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్ నెస్
- మూడు ఫిజికల్ బటన్స్‌తో 120 ఇన్ బిల్ట్ వాచ్ ఫేస్‌లు
- బ్లూ టూత్ కాలింగ్ సపోర్ట్
- 300 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ఎస్‌పీ ఓ2, హార్ట్ రేట్ ట్రాకింగ్
- ఐపీ 67 వాటర్ రెసిస్టెంట్
- 7 రోజుల బ్యాటరీ బ్యాకప్
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం