New Ear Buds : ఈ ఇయర్ బడ్స్‌తో గుండె నొప్పి ట్రాకింగ్.. ప్రాణాలను రక్షించుకునేందుకు ఇవి వాడితే చాలు..
యూకేలోని ఓ ఇయర్ బడ్స్ తయారీ సంస్థ ఇయర బడ్స్ గుండె సమస్యలను ట్రాక్ చేసే సాంకేతికతను పరిచయం చేసింది. ముఖ్యంగా సంగీతం వింటున్నప్పుడు లేదా ఫోన్‌లో చాట్ చేస్తున్నప్పుడు హైటెక్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు గుండె సమస్యలను గుర్తించేలా వీటిని అభివృద్ధి చేశారు.

ప్రస్తుత రోజుల్లో అందరిని గుండెపోటు సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు. మారుతున్న ఆహార అలవాట్లు జీవన శైలి కారణంగా అందరూ గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యూకేలోని ఓ ఇయర్ బడ్స్ తయారీ సంస్థ ఇయర బడ్స్ గుండె సమస్యలను ట్రాక్ చేసే సాంకేతికతను పరిచయం చేసింది. ముఖ్యంగా సంగీతం వింటున్నప్పుడు లేదా ఫోన్‌లో చాట్ చేస్తున్నప్పుడు హైటెక్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు గుండె సమస్యలను గుర్తించేలా వీటిని అభివృద్ధి చేశారు. హై-టెక్ సెన్సార్‌లతో వచ్చే ఈ ఇయర్ బడ్స్ గుండె కొట్టుకునేటప్పుడు ఉత్పన్నమయ్యే చిన్న కంపనాలను ట్రాక్ చేస్తాయి. అలాగే చెవి చుట్టూ ఉన్న రక్తనాళాలు, ఎముకలు, కండరాల గుండా వెళ్ళే ఈ కంపనాలను సెన్సార్ల ద్వారా రికార్డ్ చేసుకునే వెసులుబాటు ఉంది. హ్యాండ్‌హెల్డ్ పరికరంలోని మైక్రోచిప్‌కు డేటా వైర్‌లెస్‌గా ప్రసారం చేస్తుంది. ఇది గుండె రుగ్మతను సూచించే ఆధారాల కోసం విశ్లేషిస్తుంది. ఫలితాలను రోగికి, వైద్యుని స్మార్ట్‌ఫోన్‌లకు గుండె స్థితిని తెలిపే అవకాశం ఉంది. ఇయర్‌బడ్స్‌పై చేసిన పరీక్షలు అవి కర్ణిక దడ, అసాధారణ గుండె లయను గుర్తించేలా వాటిని రూపొందించినట్టు స్పష్టం అవుతుంది.
యూఎస్ సంస్థ మైండ్ మిక్స్ ఐఎన్‌సీ అభివృద్ధి చేస్తున్న ఇయర్‌బడ్‌లు సెకనుకు ఒకసారి హార్ట్‌బీట్ వైబ్రేషన్‌లను రికార్డ్ చేస్తాయి. కర్ణిక దడ గుండెను ప్రభావితం చేస్తున్నప్పుడు ఈ కంపనాల ఫ్రీక్వెన్సీ బలం బాగా పెరుగుతుంది లేదా పడిపోతుంది. గత డిసెంబర్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం, ఇయర్‌బడ్‌లను ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ)తో పోల్చింది. ఈసీజీలో, గుండె లయను ట్రాక్ చేయడానికి ఛాతీపై ఎలక్ట్రోడ్లు ఉంచుతారు. కర్ణిక దడ కోసం తనిఖీ చేయడానికి ఇది బంగారు ప్రమాణం. అయితే ఇది డాక్టర్ లేదా నర్సు చేత చేయబడాలి. కర్ణిక దడ ఉన్న 15 మంది రోగులు, 25 మంది ఆరోగ్యకరమైన వలంటీర్లపై వైద్యులు ఇయర్‌బడ్‌లను పరీక్షించినప్పుడు, ఇయర్‌బడ్‌లు ఈసీజీ వలె కచ్చితమైన రిపోర్టును అందించాయి. ఈ కంపెనీకు సంబంధించిన మొదటి బ్యాచ్ ఇయర్‌బడ్‌లు ఈ ఏడాది చివర్లో యూఎస్‌లో, ఆ తర్వాత యూకేలో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఆస్టన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ల ప్రకరాం ‘ఈ ఇయర్‌బడ్‌లు కర్ణిక దడను తీయగలవనిపేర్కొంటున్నారు. అయితే వాటిని నిర్ధారించడానికి పూర్తి క్లినికల్ ధ్రువీకరణ అవసరమని పేర్కొంటున్నారు.



మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..