- Telugu News Photo Gallery Is Your AC Not Cooling 5 Quick Tips to Solve the Problem of Air Conditioner
Air Conditioner: మీ ఇంట్లో ‘ఏసీ’ కూల్ అవ్వడం లేదా? అయితే వెంటనే ఇలా చేయండి..!
వేసవి కాలం ప్రారంభమైంది. వేడిని తట్టుకోవడానికి ‘ఏసీ’ని ఆన్ చేసే సమయం వచ్చింది. అయితే ప్రారంభించడానికి ముందు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. ‘ఏసీ’ని పూర్తిగా చెక్ చేయాలి. తద్వారా ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి. ఏసీ అనేక సంవత్సరాలుగా కలిగి ఉంటే.. సీజన్ ప్రారంభమైన వెంటనే దానిని మరమ్మతు చేయడం లేదా క్లీన్ చేయడం మంచిది. తద్వారా ఇది సీజన్ అంతటా సరిగ్గా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో మీ ఏసీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేయాలంటే కొన్ని కీలక టిప్స్ పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 16, 2023 | 5:09 PM

మన దేశంలో వేసవి కాలం చాలా వేడిగా ఉంటుంది. అందుకే దాదాపు 6 నెలల పాటు ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. అయితే, ఏసీ అధిక వినియోగం వల్ల ఫిల్టర్‌లో దుమ్ము, దూళి నిండిపోతుంది. విపరీతమైన మురికి చేరుతుంది. కారణంగా ఏసీ నుంచి చలిగాలి రావడం తగ్గుతుంది. అంతేకాదు.. దీనికారణంగా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఫిల్టర్‌ను ఆన్ చేయడానికి ముందు.. దానిని క్లీన్ చేయాలి.

కండెన్సర్ కాయిల్ AC అవుట్‌డోర్ యూనిట్‌లో ఉంటుంది. ఇది బయట ఉండడం వల్ల పావురాలు గూళ్లు కట్టుకుంటాయి. దీని ఫలితంగా చెత్త పేరుకుపోతుంది. పావురాలు అందులోనే తిష్టవేసుకుని కూర్చుంటాయి. అయితే, ఇలా ఉండకుండా ఉండేందుకు ఏసీ చుట్టూ ఒక జాలిని ఏర్పాటు చేయొచ్చు. ఇక కాయిల్స్‌ని మృదువైన బ్రష్‌తో శుభ్రం చేయాలి. నీటిని పిచికారీ చేసి దుమ్ము మొత్తాన్ని తొలగించాలి. తద్వారా ఏసీ పనితీరు మెరుగుపడుతుంది.

మీ ఏసీ అకస్మాత్తుగా ఆగిపోయినట్లయితే.. దాని థర్మోస్టాట్‌ని చెక్ చేయాలి. థర్మోస్టాట్ గది ఉష్ణోగ్రతను సెట్ చేస్తుంది. అవసరమైనప్పుడు ACని ఆన్, ఆఫ్ చేస్తుంది. థర్మోస్టాట్‌ను సరైన ఉష్ణోగ్రతకు సెట్ చేయాలి. ఆ తర్వాత కూడా సమస్య వస్తుంటే ఇంజనీర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి.

ఏసీ కారణంగా మీ కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? అయితే, ఏసీలోని మోటార్ కారణం కావొచ్చు. మోటార్ పాడైపోతే ఖచ్చితంగా సర్వీసింగ్ చేయాలి.

పాడైపోయిన ఏసీ కంప్రెసర్ శీతలీకరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కంప్రెసర్ పాడైపోయింది అయితే, దానిని మార్చడం ఉత్తమం.