- Telugu News Photo Gallery Technology photos Boat Launches new earbuds Boult Maverick features and price details Telugu Tech News
Boult Maverick: తక్కువ బడ్జెట్‌లో ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా.? బోల్ట్ మావెరిక్ ఫీచర్లు, ధర వివరాలు..
Boult Maverick: తక్కువ బడ్జెట్ ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన ఇయర్ బడ్స్ కోసం ఎదురు చూస్తున్నారా.? అయితే మీ కోసమే బోల్ట్.. మావెరిక్ పేరుతో కొత్త ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 17, 2022 | 8:38 PM

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ బోల్ట్ సరికొత్త డిజైన్‌తో ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. బోల్ట్ మావెరిక్ పేరుతో భారత మార్కెట్లోకి ఈ కొత్త ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది.

ఈ ఇయర్‌బడ్స్‌లో సౌండ్ క్లారిటీ కోసం ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ (ENC) అనే సరికొత్త టెక్నాలజీని అందించారు. ఇక కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్‌ను ఇచ్చారు. 10 మీటర్ల వరకు రేంజ్ ఉంటుంది.

టచ్ కంట్రోల్స్‌తో రూపొందించిన ఈ ఇయర్ బడ్స్‌లో కాల్స్, మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్, సిరి లాంటి వాయిస్ అసిస్టెంట్‌లను కూడా టచ్ కంట్రోల్‌తో వాడుకోవచ్చు.

ఈ ఇయర్ బడ్స్‌ను ఒక్కసారిగా ఫుల్ చార్జ్‌పై 7 గంటల ప్లే టైమ్‌ను ఇస్తాయి. చార్జింగ్ కేస్‌తో కలిపి 35 గంటల వరకు ప్లేటైమ్ వస్తుంది. వాటర్ రెసిస్టెంట్స్ కోసం IPX5 రేటింగ్‌ను ఇచ్చారు.

ధర విషయానికొస్తే బోల్ట్ మావెరిక్ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 1799 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ ఆఫర్ కింద రూ. 1499కే లభిస్తున్నాయి.





























