- Telugu News Photo Gallery Technology photos Noise launches news earbud Noise Buds VS 104 features and price
Noise Buds VS104: నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు..
Noise Buds VS104: మార్కెట్లో రోజుకో కొత్త ఇయర్ బడ్స్ సందడి చేస్తున్న తరుణంలో నాయిస్ కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. నాయిస్ బడ్స్ వీఎస్ 104 పేరుతో లాంచ్ చేసిన ఈ ఇయర్ బడ్స్ ఈ నెల 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి...
Updated on: Jun 12, 2022 | 11:20 AM

ప్రముఖ దేశీయ గ్యాడ్జెట్ సంస్థ నాయిస్ కొత్త ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. నాయిస్ బడ్స్ వీఎస్ 104 పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్ మొదటి సేల్ జూన్ 14న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో ప్రారంభంకానుంది.

నాయిస్ బడ్స్ వీఎస్ 104 ధర విషయానికొస్తే లాంచింగ్ ఆఫర్ కింద రూ. 999కే అందుబాటులో ఉంది. ఒకవేళ సేల్ మొదలైన 104 నిమిషాల్లోగా కొనుగోలు చేస్తే రూ. 104 డిస్కౌంట్‌తో సొంతం చసుకోవచ్చు.

ఈ ఇయర్ బడ్స్‌లో 13mm సౌండ్ డ్రైవర్లు అందించారు. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.2 (Bluetooth v5.2)ను ఇచ్చారు. రేంజ్ 10 మీటర్ల వరకు ఉంటుంది.

ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ హైపర్ సింక్ టెక్నాలజీతో తయారు చేశారు. చార్జింగ్ ఎంత ఉందో తెలిపేలా ఎల్‌ఈడీ లైట్‌ను అందించారు.

ఇక ఛార్జింగ్ విషయానికొస్తే ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 30 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. చార్జింగ్ కోసం కేస్‌కు టైప్-సీ పోర్ట్ ఉంటుంది. 10 నిమిషాలు చార్జ్ చేస్తే గంటపాటు పని చేస్తుంది.




