Fire Boltt Smart Watch: సిరామిక్ బాడితో సూపర్ స్మార్ట్ వాచ్.. అదిపోయే ఫీచర్స్‌తో పాటు మతిపోయే డిజైన్..
ఫైర్ బోల్ట్ కంపెనీ లక్స్ కలెక్షన్ల కింది బ్లిజార్డ్ ప్రీమియం వాచ్‌ను రిలీజ్ చేసింది. ఫుల్ సిరామిక్ బాడితో 220 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ వాచ్ కచ్చితంగా ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తక్కువ ధరలోనే ఇది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నారు.
ఇటీవల భారత్‌లో స్మార్ట్ వాచ్ వాడకం విపరీతంగా పెరిగింది. కంపెనీలు కూడా ఇబ్బడిముబ్బడిగా స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఫైర్ బోల్ట్ కంపెనీ లక్స్ కలెక్షన్ల కింది బ్లిజార్డ్ ప్రీమియం వాచ్‌ను రిలీజ్ చేసింది. ఫుల్ సిరామిక్ బాడితో 220 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ వాచ్ కచ్చితంగా ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తక్కువ ధరలోనే ఇది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నారు. రూ.3499 ప్రారంభ ధరతో అందుబాటులోకి వస్తుంది. ఫిబ్రవరి 23 నుంచి కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు అన్ని అధికారిక ఈ-కామర్స్ సైట్స్‌లో ఈ వాచ్ సేల్ ప్రారంభంకానుంది. సాధారణ సిల్వర్, గోల్డ్, బ్లాక్ కలర్స్ ఈ వాచ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. యాంటి రస్ట్ ఫీచర్‌తో పాటు హైటెక్ సిరామిక్ డ్యుయల్ షేడ్‌లో కలిగి ఉంటాయి. హోం బటన్, బ్యాక్ బటన్ వంటి ఫీచర్లతో ఈ వాచ్ కస్టమర్లకు ఆకట్టుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
ఫైర్ బోల్ట్ బ్లిజార్డ్ ఫీచర్లు ఇవే
240X240 రిజుల్యూషన్‌తో 1.28 అంగుళాల డిస్‌ప్లేతో వృత్తాకార డిజైన్‌తో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు అంతర్నిర్మిత స్పీకర్‌తో ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. స్మార్ట్ నోటిఫికేషన్‌లు, కెమెరా నియంత్రణ, వాతావరణ నవీకరణలు, మరిన్ని ఉపయోగకరమైన ఫీచర్‌లను అందిస్తుంది. స్మార్ట్ వాచ్ వాయిస్ అసిస్టెంట్‌కి మద్దతు ఇస్తుంది. అలాగే అంతర్నిర్మిత గేమ్‌లను కూడా కలిగి ఉంటుంది. 120 విభిన్న స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. అలాగే హార్ట్ బీట్ మానిటర్, SpO2, నిద్ర రుతు చక్రం మానిటర్‌ను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఈ వాచ్‌లో 220 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఏడు రోజుల బ్యాకప్‌ను కలిగి ఉంటుంది. ఐపీ 67 సర్టిఫైడ్ వాటర్-రెసిస్టెంట్ ఫీచర్‌తో ఇది స్మార్ట్ వాచ్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం