Smart watch: బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్‌తో స్మార్ట్ వాచ్.. అతి తక్కువ ధరకే వచ్చేస్తోంది.. మిస్ చేసుకోవద్దు..
స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. మంచి ఫీచర్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్, అతి తక్కువ ధరలో ఓ స్మార్ట్ వాచ్ మన దేశంలో లాంచ్ అయ్యింది. హమ్మర్ ఏస్ 3.0(Hammer ACE 3.0) పేరుతో దీనిని విడుదల చేశారు.
స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. మంచి ఫీచర్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్, అతి తక్కువ ధరలో ఓ స్మార్ట్ వాచ్ మన దేశంలో లాంచ్ అయ్యింది. హమ్మర్ ఏస్ 3.0(Hammer ACE 3.0) పేరుతో దీనిని విడుదల చేశారు. మెటాలిక్ బాడీ తోపాటు స్కిన్ ఫ్రెండ్లీ సిలికాన్ స్ట్రాప్ తో ఇది వస్తోంది. యాపిల్ వాచ్ లుక్ లో ప్రీమియం క్లాసీ డిజైన్ తో ఈ స్మార్ట్ వాచ్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్పెసిఫికేషన్లు ఇవి..
హమ్మర్ ఏస్ 3.0 స్మార్ట్ వాచ్ లో 1.85 అంగుళాల ఐపీఎస్ లార్జ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంది. 500 నిట్స్ వరకూ బ్రైట్ నెస్ అడ్జస్ట్ అవుతుంది. దీనిలో కాలింగ్ ఆప్షన్ ఉంది. బిల్ట్ స్పీకర్, మైక్రోఫోన్ ఉంది. త్వరగా యాక్సెస్ చేయడానికి వాయిస్ అసిస్టంట్ ఉంది. దీనిలో 190 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ కూడా ఉంది. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే దాదాపు 5 రోజుల వరకూ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఐపీ67 వాటర్, డస్ట్ ఫ్రూఫ్ సాంకేతికతతో వస్తోంది. దీనిలో వినియోగదారులు దాదాపు 50 కాంటాక్ట్ లవరకూ సేవ్ చేసుకోవచ్చు. 5.0 బ్లూటూత్ ఫెసిలిటీ ఉంది.
అంచనాలకు మించి..
హమ్మర్ ఏస్ 3.0 స్మార్ట్ వాచ్ పై హమ్మర్ కంపెనీ ఫౌండర్, సీఓఓ మాట్లాడుతూ ఈ వాచ్ పనితీరు వినియోగదారుల అంచనాకు మించి ఉంటుందని చెప్పారు. అధిక నాణ్యతతో కూడిన ఉత్పత్తిని అతి తక్కువ ధరలో, అత్యద్భుత పనితీరుతో అందించామని వివరించారు. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేశారు.
ధర ఎంతంటే..
హమ్మర్ 3.0 స్మార్ట్ వాచ్ ధర అందుబాటులో ఉంది. రూ.1,999 కు హమ్మర్ అధికారికి వెబ్ సైట్, అమెజాన్, మింత్రా, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్, నైకా, టాటాక్లిక్, క్రెడ్ ప్లాట్ ఫామ్ లపై అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..