AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Fraud: సోషల్ మీడియాలో స్నేహం కొంపముంచింది.. తియ్యగా మాట కలిపి రూ.12 లక్షలు స్వాహా

కొనని లాటరీ టికెట్‌ నుంచి ఎవరైనా లాటరీ ఎలా గెలుచుకుంటారు? లక్షల డబ్బుతోపాటు గిఫ్టులు ఎవరైనా ఎందుకు పంపుతారు? ఈ చిన్న లాజిక్‌ మిస్‌ అవ్వడం వల్ల ఎందరో సైబర్‌ నేరగాళ్ల వలలో చక్కుకుని తమ చేతులతో తామే బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ..

Cyber Fraud: సోషల్ మీడియాలో స్నేహం కొంపముంచింది.. తియ్యగా మాట కలిపి రూ.12 లక్షలు స్వాహా
Cyber Fraud
Srilakshmi C
|

Updated on: Mar 17, 2023 | 5:18 PM

Share

కొనని లాటరీ టికెట్‌ నుంచి ఎవరైనా లాటరీ ఎలా గెలుచుకుంటారు? లక్షల డబ్బుతోపాటు గిఫ్టులు ఎవరైనా ఎందుకు పంపుతారు? ఈ చిన్న లాజిక్‌ మిస్‌ అవ్వడం వల్ల ఎందరో సైబర్‌ నేరగాళ్ల వలలో చక్కుకుని తమ చేతులతో తామే బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా ముంబాయికి చెందిన ఓ మహిళ ఇదే విధమైన మోసానికి గురయ్యి ఏకంగా రూ.12 లక్షలకుపైగా నగదును పోగొట్టుకుంది. వివరాల్లోకెళ్తే..

మహారాష్ట్ర థానే నగరానికి చెందిన 36 ఏళ్ల మహిళ సైబర్ మోసగాళ్ల మాయలోపడి రూ.12 లక్షలకు పైగా డబ్బును పోగొట్టుకుంది. బాదితురాలి ఫిర్యాదు మేరకు కపూర్‌బావడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులు ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం (మార్చి 17) గుర్తించారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు నవంబర్ 2022 నుంచి బాధిత మహిళతో సోషల్ మీడియాలో స్నేహం చేస్తున్నాడు. తాను మలేషియాకు చెందినవాడినని, యూకేలో ఉద్యోగం చేస్తున్నట్లు మహిళను నమ్మించాడు. యూకే నుంచి ఆమెకు కొన్ని గిఫ్ట్‌లు పంపిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ఆమెకు మెసేజ్‌లు పంపాడు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో కస్టమ్స్ అధికారినంటూ ఓ మహిళ నుంచి బాధితురాలికి ఫోన్‌కాల్‌ కూడా వచ్చింది. కస్టమ్స్‌ నుంచి గిఫ్ట్‌ పార్శిల్‌లను పంపేందుకు కొంత డబ్బు చెల్లించవల్సి ఉంటుందని, కొంత మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు కస్టమ్స్ అధికారిని ఫోన్‌లో తెల్పింది. ఇదంతా నిజమేనని అనుకున్న బాధిత మహిళ రూ.12.47 లక్షలు సైబర్‌ నేరగాళ్ల ఖాతాకు ట్రాన్ఫర్‌ చేసింది. ఎన్ని రోజులైనా బహుమతులు అందకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?