Delhi: 57 కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు రద్దు.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా దేశంలో 57 కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికల నిర్వహణపై ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది. దాంతో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Delhi: 57 కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు రద్దు.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..
Cantonment Board Elections 2023
Follow us

|

Updated on: Mar 17, 2023 | 4:58 PM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా దేశంలో 57 కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికల నిర్వహణపై ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది. దాంతో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను కేంద్రం ఇప్పుడు రద్దు చేసింది. ఎన్నికల నిర్వహణపై ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ ఇచ్చింది రక్షణ శాఖ. దీని ప్రకారం.. ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించేందుకు మార్చి 28, 29 తేదీల్లో నామినేషన్లు స్వీకరించాలని అధికారుల నిర్ణయించారు. ఈ నెల 4న కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ముగిసింది.

మరోవైపు కంటోన్మెంట్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో.. దేశంలోని మరికొన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు వాయిదా వేయాలంటూ పలువురు నామిటనేటెడ్ సభ్యులు రక్షణశాఖను కోరారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని కంటోన్మెంట్ల ఎన్నికలపై ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది రక్షణ శాఖ. దీని ప్రకారం.. సికింద్రబాబాద్ కంటోన్మోంట్ బోర్డ్ సహా దేశ వ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..