Health Tips: వీరు పొరపాటున కూడా కాఫీ తీసుకోవద్దు.. షాకింగ్ వివరాలు మీకోసం..

అలసిపోయినప్పుడు టీ లేదా కాఫీ తాగాలని చాలా మందికి ఉంటుంది. టీ, కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది తలనొప్పి, అలసట, శక్తి హీనతను తగ్గిస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకాదు.. ఒత్తిడిని తగ్గిస్తుంది.

Health Tips: వీరు పొరపాటున కూడా కాఫీ తీసుకోవద్దు.. షాకింగ్ వివరాలు మీకోసం..
Caffeine
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 16, 2023 | 5:04 PM

అలసిపోయినప్పుడు టీ లేదా కాఫీ తాగాలని చాలా మందికి ఉంటుంది. టీ, కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది తలనొప్పి, అలసట, శక్తి హీనతను తగ్గిస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకాదు.. ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, కొన్నిసార్లు ఈ కెఫిన్ శరీరానికి హాని కూడా చేస్తుంది. కెఫిన్ వల్ల కలిగే ప్రయోజనాలు, దాని వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కెఫిన్ ప్రయోజనాలు..

ఒక వ్యక్తికి ఒక రోజులో 400 mg కెఫిన్ అవసరం. కెఫీన్ అలసట, ఆకలి, బలహీనత లక్షణాలను తొలగిస్తుంది. నిజానికి, కెఫీన్ ఉన్న ఆహారాలు, డ్రింక్స్ తీసుకున్న తరువాత అది శరీరంలోని రక్తంలో కలిసిపోతుంది. నేరుగా మెదడును చేరుకుంటుంది. అలా శరీరంలో అలసటను తొలగించి చురుకుగా చేస్తుంది. ఈ కారణంగా వ్యక్తి బలహీనత, ఆకలి భావన లేకుండా రిఫ్రెష్‌గా ఉంటారు. కెఫీన్.. శరీరాన్ని సంతోషపరిచే, ఉత్తేజపరిచే డోపమైన్, అడ్రినలిన్ హార్మోన్లను చురుకుగా మారుస్తుంది. ఫలితంగా వ్యక్తి సంతోషంగా, ఉల్లాసంగా, తాజాగా ఉంటారు.

కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు..

చాలా మంది టీ, కాఫీ ద్వారా కెఫిన్ తీసుకుంటారు. ఇది కాకుండా, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, కోల్డ్ కాఫీ, చాక్లెట్ షేక్స్ మొదలైన వాటిలో కూడా కెఫీన్ ఉంటుంది. కాఫీతో పోలిస్తే టీలో కెఫీన్ తక్కువగా ఉంటుంది. ఒక కప్పు కాఫీలో మూడు టీలకు సమానమైన కెఫీన్ ఉంటుంది. అందుకే రోజుకు మూడు టీలు గానీ, ఒక కప్పు కాఫీ తాగితే సరిపోతుంది. దీనికంటే ఎక్కువగా కెఫిన్ తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది. కెఫిన్‌ను పరిమితికి మించి తీసుకుంటే.. ఎక్కువ మూత్రం వస్తుంది. దీని కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అంతేకాదు.. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వస్తుంది.

ఇవి కూడా చదవండి

వీరు కెఫిన్ ఎక్కువగా తీసుకోవద్దు..

అధిక బీపీ ఉన్నవారు ఎక్కువగా కెఫిన్ తీసుకోకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలు ఇచ్చే స్త్రీలు కూడా ఎక్కువగా కెఫిన్ తీసుకోకూడదు. నిద్రలేమి సమస్య ఉన్నవారు లేదా గ్యాస్ట్రో సమస్యలు ఉన్నవారు కూడా కెఫిన్ ఎక్కువగా తీసుకోవద్దు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కెఫిన్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..