Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బస్సులో ఖాళీ లేదని డ్రైవర్‌ సీట్లో కూర్చున్న మహిళ.. తగ్గేదే లేదంటూ హల్‌చల్‌.. వీడియో చూడాల్సిందే..

ఒక మహిళ ప్రయాణికురాలు..తనకు బస్సులో సీటు లేదని ఏకంగా డ్రైవర్ సీట్లోనే కూర్చుంది. ఇక ఆ సీటులోంచి అస్సలు ఖాళీ చేసేది లేదని తెగేసి చెప్పింది.

Viral Video: బస్సులో ఖాళీ లేదని డ్రైవర్‌ సీట్లో కూర్చున్న మహిళ.. తగ్గేదే లేదంటూ హల్‌చల్‌.. వీడియో చూడాల్సిందే..
Woman Sit On Bus Driver Sea
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 17, 2023 | 5:13 PM

సోషల్ మీడియాలో మనం తరచుగా ఎన్నో ఫన్నీ వీడియోలను చూస్తుంటాం. అందులోని కామెడీ సీన్స్‌ చూసిన తర్వాత యూజర్లు నవ్వును ఆపుకోలేకపోతుంటారు. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి తాజాగా వైరల్‌ అవుతోంది. అది చూసిన వినియోగదారులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పగలబడి నవ్వుకుంటారు. అదేంటంటే.. బస్సులో ఎక్కిన మహిళ ప్రయాణికులు చేసిన పనికి బస్సులో ఉన్న వాళ్లంతా భయంతో వణికిపోయారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలిస్తే..

నగరాల నుండి గ్రామాలకు బస్సులు చాలా తక్కువ సంఖ్యలో తిరుగుతుంటాయి. పైగా అవన్నీ ఎప్పుడూ కిక్కిరిసిపోయి ఉంటాయి. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడం మనమందరం చూస్తూనే ఉంటాం.. బస్సులో ప్రయాణికులకు కూర్చోవటానికి అనుకూలంగా సీట్లు ఉంటాయి. ప్రయాణికులంతా వాటిపైనే కూర్చుంటారు. దీంతోపాటు బస్సులో కండక్టర్‌, డ్రైవర్‌లకు కూడా ప్రత్యేకించి సీట్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్ర ఒక మహిళ ప్రయాణికురాలు..తనకు బస్సులో సీటు లేదని ఏకంగా డ్రైవర్ సీటుపై కూర్చుంది. ఇక ఆ సీటులోంచి అస్సలు ఖాళీ చేసేది లేదని తెగేసి చెప్పింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? మేము మీతో జోక్ చేయడం లేదు… ఇది జోక్ కాదు నిజమే..! ఈ వింత సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వీడియో చూసి యూజర్లు తలలు పట్టుకుంటున్నారు. కొందరు వినియోగదారుల ఇదేక్కడి పిచ్చిరా సామి అనుకుంటూ పగలబడి నవ్వుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయబడింది. ఇందులో బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్‌ సీటులో ఓ మహిళ కూర్చోవడం కనిపించింది.

ఇవి కూడా చదవండి

డ్రైవర్ బస్సు దగ్గరకు వచ్చి, తన సీటులో కూర్చున్న మహిళను చూసి ఒక్క క్షణం షాక్‌ అవుతాడు.. ఆమెను అక్కడ్నుంచి ఖాళీ చేయాలని అడిగాడు. కానీ, ఆమె ఆ సీటును వదిలి వెళ్లేందుకు సిద్ధంగా లేదు. అదే సమయంలో బస్సు డ్రైవర్‌ సీట్లో కూర్చున్న మహిళ అత్త కూడా డ్రైవర్‌కి ఎదురుతిరిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో శ‌ర‌వేగంగా షేర్ అవ‌డంతో వైర‌ల్ అవుతోంది. ఇది చూసి యూజర్లు తెగ నవ్వుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..