ఇదేం పనిరా బాబు.. ఉద్యోగంలో నుంచి తీసెస్తే మరి ఇంతలానా

ఈ మధ్యకాలంలో ఎవరినైనా పనిలోనుంచి తీసేసిన లేక వారి పనితీరు నచ్చక పనిలోకి తీసుకోకపోయినా ద్వేషంతో రగిలిపోతారు. ఒకవేళ పనిలో చేసేటప్పుడు చివాట్లు పెట్టినవారిపై పగలు పెంచుకుంటారు.

ఇదేం పనిరా బాబు.. ఉద్యోగంలో నుంచి తీసెస్తే మరి ఇంతలానా
Man Pours Acid Video
Follow us

|

Updated on: Mar 17, 2023 | 5:03 PM

ఈ మధ్యకాలంలో ఎవరినైనా పనిలోనుంచి తీసేసిన లేక వారి పనితీరు నచ్చక పనిలోకి తీసుకోకపోయినా ద్వేషంతో రగిలిపోతారు. ఒకవేళ పనిలో చేసేటప్పుడు చివాట్లు పెట్టినవారిపై పగలు పెంచుకుంటారు. ఆ తర్వాత క్షణికావేశంలో పిచ్చిపనులు చేస్తుంటారు. వారిపై ఎలాగైన పగ తీర్చుకోవాలని రకారకాలుగా ఆకతాయి పనులు చేసి జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..నొయిడాలోని ఓ హౌసింగ్‌ సోసైటీలో ఓ వ్యక్తి క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతని పనితీరు నచ్చక అతన్ని పనిలోంచి తీసేయాలని సొసైటీ సభ్యులు నిశ్చయించుకున్నారు. దీంతో కోపంతో రగిలిపోయిన అతను డజనుకు పైగా కార్లపై యాసిడ్‌ పోసి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. దీంతో కార్లన్ని ఘోరంగా ధ్వంసమయ్యాయి. దీనికి గల కారణాలేంటని సమీపంలోని సీసీటీవీ ఫుట్‌జ్‌ పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదంత క్లీనర్‌ రామ్‌రాజ్‌ పని అని తెలిసి సోసైటీ వాసులు షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో కనిపించిన అగంతుకుడ్ని గుర్తించిన సోసైటీ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ట్రాక్‌ చేసి అపార్టమెంట్‌ వాసుల వద్దకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వారంతా ఆ క్లీనర్‌పై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో క్లీనర్‌ తనకు ఎవరో యాసిడ్‌ ఇచ్చారంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ..పోలీసులు అతన్ని నేరస్తుడిగా అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ క్లీనర్‌ సోసైటీలో 2016 నుంచి పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..