National: నా ప్రియురాలిని ఆమె భర్త నుంచి విడిపించండి.. కోర్టు మెట్లెక్కిన వ్యక్తికి న్యాయస్థానం సమాధానం ఏంటంటే.
సహజీవనం అగ్రిమెంట్ ప్రకారం తన ప్రియురాలిని ఆమె భర్త నుంచి విడిపించి తనకు అప్పజెప్పాలని ఓ వ్యక్తి ఏకంగా కోర్టును ఆశ్రయించాడు. అయితే దీనికి కోర్టు దిమ్మతిరిగే సమాధాన ఇచ్చింది. ఇంతకీ ప్రియురాలిని..
సహజీవనం అగ్రిమెంట్ ప్రకారం తన ప్రియురాలిని ఆమె భర్త నుంచి విడిపించి తనకు అప్పజెప్పాలని ఓ వ్యక్తి ఏకంగా కోర్టును ఆశ్రయించాడు. అయితే దీనికి కోర్టు దిమ్మతిరిగే సమాధాన ఇచ్చింది. ఇంతకీ ప్రియురాలిని విడిపించమని ప్రియుడు కోర్టు మెట్లు ఎక్కడం ఏంటి.? అది కూడా భర్త నుంచి ఏంటి.? అనే సందేహం వస్తోంది కదూ! అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఈ విచిత్రమైన సంఘటన గుజరాత్‌లో జరిగింది. లివ్ ఇన్ అగ్రిమెంట్ ప్రకారం తన ప్రియురాలిని ఆమె భర్త నుంచి విడిపించాలని వస్కాంత జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
తాను కస్టడీ కోరుతున్న మహళ తనతో సంబధం కలిగి ఉందని తెలిపిన అతను.. ఆమె ఇష్టానికి విరుద్ధంగా మరొకరితో వివాహం జరిగింది. వారిద్దరూ కలిసి జీవించలేకపోయారు. ఆమె తన భర్తను విడిచిపెట్టి నా వద్దకు వచ్చింది. అనంతరం మేమిద్దరం లివ్-ఇన్ రిలేషన్ షిప్ అగ్రిమెంట్‌పై సంతకం చేశాము అని చెప్పుకొచ్చాడు. అయితే కొన్ని రోజుల తర్వాత మహిళ కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా భర్త వద్దకు తీసుకెళ్లారు. దీంతో తన ప్రియురాలి కోసం హెబియన్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తూ.. తన ప్రియురాలి ఆమె భర్త అక్రమ కస్టడీలో ఉందని, ఆమె ఇష్టానికి విరుద్దంగా కుటుంబ సభ్యులు ఇలా చేశారని, ఎలాగైనా ఆమెను తిరిగి తన వద్దకు చేర్చాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్ దాఖలు చేయడానికి అతనికి ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. స్త్రీ తన భర్త కస్టడీలో ఉంటే ఆమె అక్రమ కస్డడీలో ఉందని చెప్పలేమన్నారు. కేసును విచారించిన జస్టిస్ వీఎం పంచోలి, జస్టిస్ హెచ్‌ఎం ప్రచ్చక్‌లతో కూడిన ధర్మాసనం.. పిటిషనర్‌తో ఆ మహిళలకు వివాహం జరగలేదని, అలాగే ఆమె తన భర్త నుంచి కూడా విడాకులు తీసుకోలేదని పేర్కొంది. కాబట్టి పిటిషనర్ ఆరోపించినట్లుగా ఆ మహిళ తన భర్తతో అక్రమ కస్డడీలో ఉందని చెప్పలేమని తేల్చి చెప్పారు. ఈ పిటిషన్‌ను దాఖలు చేయడానికి పిటిషన్‌రకు ఎలాంటి హక్కులేదని, ఇందుకు గాను పిటిషనర్‌పై రూ. 50000 జరిమాన విధించారు. జరిమానాను స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..