Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన ధర. రూ. 60 వేలకు చేరువలో తులం గోల్డ్..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బంగారం ధరలు షాక్‌ కొట్టేలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుండగా శుక్రవారం బంగారం ధర ఒకేసారి పెరిగింది. తులంపై ఏకంగా...

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన ధర. రూ. 60 వేలకు చేరువలో తులం గోల్డ్..
Gold Price
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 17, 2023 | 6:25 AM

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బంగారం ధరలు షాక్‌ కొట్టేలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుండగా శుక్రవారం బంగారం ధర ఒకేసారి పెరిగింది. తులంపై ఏకంగా రూ. 550 పెరగడం గమనార్హం.

ఏప్రిల్‌లో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయన్న వార్తలకు ఇది ఊతమిచ్చినట్లైంది. ఇక దేశ వ్యాప్తంగా శుక్రవారం దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఈ రోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 53,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,180 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,250 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180 వద్ద నమోదైంది.

ఇవి కూడా చదవండి

* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,550 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.58,420 వద్ద ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,470 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420 ఉంది.

వెండి ధర ఎలా ఉందంటే..

బంగారం ధరతో పాటు వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. శుక్రవారం దేశంలో కిలో వెండిపై రూ. 200 వరకు పెరిగింది. శుక్రవారం చెన్నైలో కిలో వెండి ధర రూ.72,700, ముంబైలో రూ.69,200, ఢిల్లీలో రూ.69,200, కోల్‌కతాలో కిలో వెండి రూ.69,200, బెంగళూరులో రూ.72,700, హైదరాబాద్‌లో రూ.72,700, విశాఖ, విజయవాడలో రూ.72,700 వద్ద ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.