Business Ideas: ఉన్న ఊరిలోనే ఇంటి నుంచి కదలకుండా నెలకు రూ. 1 లక్ష సంపాదించాలని ఉందా?.. అయితే ఈ బిజినెస్ మీకోసమే..
నేటికాలంలో చాలామంది ఉద్యోగాల కంటే వ్యాపారాలవైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయం నుంచి ఈ ట్రెండ్ పెరిగింది.

నేటికాలంలో చాలామంది ఉద్యోగాల కంటే వ్యాపారాలవైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయం నుంచి ఈ ట్రెండ్ పెరిగింది. కోవిడ్ కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు చాలా మంది బిజినెస్ వైపు అడుగులు వేశారు. కాస్త తెలివిగా ఆలోచించి వ్యాపారాలు ప్రారంభించి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ మధ్య కూడా యువత ఉద్యోగాల కంటే బిజినెస్ బెటర్ అనుకుంటున్నారు. తక్కువ సమయంలో ధనవంతుడిని చేసే వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనవారిలో మొదలౌతున్నాయి. మీరు కూడా అలాంటి వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే మీకోసం కొన్ని వ్యాపార ఆలోచనలు ఉన్నాయి. మీరు గ్రామీణ వాతావరణానికి సంబంధించి ఈ వ్యాపారాన్ని సులభంగా చేయవచ్చు.
మీరు మంచి లాభదాయకమైన వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే, మీరు ముర్రా గేదెల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముర్రా జాతి గేదెలలో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి దీని డిమాండ్ కూడా బాగానే ఉంది. ఇతర జాతుల గేదెల కంటే ఇవి ఎక్కువ పాలు ఇస్తాయి. అందుకే వీటిని నల్లబంగారం అని కూడా పిలుస్తుంటారు. లాభం గురించి మాట్లాడుతే.. మీరు ముర్రా గేదెను పెంచడం ద్వారా బాగా సంపాదించవచ్చు. మీరు డెయిరీ సంబంధిత ఉద్యోగాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఈ జాతి గేదె రోజుకు 20 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తుంది.
ముర్రె జాతి గేదెలను దూరం నుంచే గుర్తించవచ్చు. వాటి రంగు ముదురు నలుపు, తల పరిమాణం చిన్నది. బాడీ స్ట్రక్చర్ బాగుండడంతోపాటు కొమ్ములు ఉంగరాలలా ఉంటాయి. వాటి తోక కూడా ఇతర గేదె జాతుల కంటే పొడవుగా ఉంటుంది. ఈ జాతి గేదెలను హర్యానా, పంజాబ్‌లో ఎక్కువగా పెంచుతారు. పాడి పరిశ్రమతో పాటు, ఈ జాతి గేదెలను కొనడం, అమ్మడం ద్వారా మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు. ఈ రకమైన గేదెలకు గిరాకీ బాగా ఉండటంతో మంచి డబ్బు సంపాదించవచ్చు. ఒక గేదె రూ.2 లక్షల వరకు ఉంటుంది.




ఈ గేదె రోజు 20 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తుంది. అంటే ఈ లెక్కన లీటర్ కు 60 రూపాయలు ఉంది.రోజుకు 30 లీటర్లు అంటే 1800రూపాయలు పాలకు వస్తుంది. అంటే నెలకు దాదాపు రూ. 54,000రూపాయలు. అంతేకాదు పేడను విక్రయించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. ఒక ట్రాక్టర్ లోడు పేడ దాదాపు 3 నుంచి 5 వేలు పలుకుతుంది. ఇలా నెలకు ఒకటి లేదా రెండు లోడుల పేడను విక్రయించవచ్చు. అయితే ఈ ముర్రే గేదెలను పెంచడం అంత పెద్ద కష్టం కాదు. వాటికి కావల్సిన దాణ, పచ్చిగడ్డి ఇస్తే సరిపోతుంది. నెలకు దాణకు, పచ్చిగడ్డికి 5 నుంచి 10వేలు ఖర్చు చేసినా..దాదాపు 40 వేలు మీకు మిగులుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి