- Telugu News Photo Gallery Business photos Business Idea of Ice Cube factory in summer season for just one lakh to get good income
Business Idea: మండే ఎండల్లో సిరులు కురిపించే బిజినెస్ ఐడియా.. రూ.లక్ష పెట్టుబడితో రోజూ వేలల్లో సంపాదించొచ్చు..
Great Business Idea: ఈ వేసవిలో తక్కువ బడ్జెట్‌లో వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నట్లయితే.. మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా చెప్పబోతున్నాం..
Updated on: Mar 16, 2023 | 3:30 PM

Great Business Idea: ఈ వేసవిలో తక్కువ బడ్జెట్‌లో వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నట్లయితే.. మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా చెప్పబోతున్నాం.. ఈ వ్యాపారం కేవలం లక్షతోనే ప్రారంభమవుతుంది. దీనితో మొత్తం వేసవి సీజన్‌లో చేతినిండా సంపాదించొచ్చు..

ఈ సమ్మర్ సీజన్ లో ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీ ద్వారా బాగా సంపాదించవచ్చు. వేసవిలో ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీకి బాగా డిమాండ్ ఉంటుంది.. ఈ వ్యాపారం బాగా జరిగి.. సిరుల వాన కురిపిస్తుంది.

వేసవి కాలంలో ఐస్ క్యూబ్స్‌కు డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. శీతాకాలంలో దీని డిమాండ్ గణనీయంగా తగ్గుతుంది. అయితే, వేసవి ప్రారంభం కావున మీరు మీ గ్రామంలో లేదా నగరంలో ఎక్కడైనా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించవచ్చు.

షాపుల నుంచి పెళ్లిళ్ల వరకు వేసవిలో ఐస్ క్యూబ్స్‌కు చాలా డిమాండ్ ఉంటుంది. కావున మరో ఐదు నెలల్లో ఐస్ ఫ్యాక్టరీ ద్వారా మంచిగా సంపాదించుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా ఈ వ్యాపారం బాగా సాగుతోంది.

ఐస్ క్యూబ్స్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి, మీరు మొదట సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీ కోసం పెద్ద ఫ్రీజర్ అవసరం. దీంతోపాటు విద్యుత్తు కనెక్షన్, స్వచ్ఛమైన నీటి అవసరం ఉంటుంది.

మొదట్లో ఈ వ్యాపారం కోసం లక్ష రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అదనంగా దీనికి డీప్ ఫ్రీజర్ అవసరం అవుతుంది. ఇది 50 వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. మీకు ఇతర పరికరాలు కూడా అవసరం అవుతాయి. ఐస్ క్యూబ్స్ ఫ్యాక్టరీ పనిని ప్రారంభించే ముందు మార్కెట్ లో దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి..

ఈ వ్యాపారంలో ప్రారంభంలో రూ.30,000 వరకు సంపాదించవచ్చు. పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ పెరిగినప్పుడు మీ సంపాదన రూ.50,000 వరకు ఉంటుంది. రోజుకు కనీసం రూ.5వేల వరకు మాత్రం రాబడి వస్తుంది.

అయితే, ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు వీలుగా కేవలం ఆలోచన మాత్రమే అందించాం.. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు సలహాలు, సూచనలు తీసుకోవడం, అలాగే పెట్టుబడికి అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. విక్రయంపై ఆధారపడి ఉంటాయి.




