ఫుటుగా తాగేసిన పెళ్లికొడుకు.. మత్తులో అన్నీ మర్చిపోయి నిద్రపోయాడు.. తాగుబోతు తిక్క కుదిర్చిన పెళ్లి కూతురు..!

అవును మీరు విన్నది నిజమే.. మద్యం మత్తులో ఇంటికి వెళ్లేటప్పుడు పరిచయస్తులను మరచిపోవడం సహజం. కానీ, ఈ తాగుబోతు పెళ్లి కొడుకు ఆ రోజు తన పెళ్లి అన్న విషయం మర్చిపోయాడు. ఇలాంటి వింత ఘటన

ఫుటుగా తాగేసిన పెళ్లికొడుకు.. మత్తులో అన్నీ మర్చిపోయి నిద్రపోయాడు.. తాగుబోతు తిక్క కుదిర్చిన పెళ్లి కూతురు..!
Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 17, 2023 | 4:11 PM

వివాహం అనేది అందమైన సంబంధం. కానీ ఇటీవలి కాలంలో ఈ పవిత్ర సంబంధం దాని అర్ధాన్ని కోల్పోతోంది. విడాకులు, అనైతిక సంబంధం కారణంగా వివాహం అర్థరహితం అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రేమించి మధ్యలోనే వదిలేయడం, నిశ్చితార్థం చేసుకుని క్యాన్సిల్ చేసుకోవడం, పెళ్లి పీటలపైనే ఆ అబ్బాయి నాకు వద్దు అని చెప్పడం సర్వసాధారణమైపోయింది. అందుకే పెళ్లికి ముందు ఎంత ప్రిపరేషన్ పనులు చేసినా తాళి కట్టేంత వరకు పెళ్లి పూర్తయిందని నమ్మలేని పరిస్థితి నెలకొంది.అలాంటిదే ఇక్కడ వైరల్‌ అవుతున్న వార్తకథనం కూడా. మండపం వరకు చేరిన పెళ్లి వేడుక మధ్యలోనే ఆగిపోయింది. దానికి కారణం వరుడి బాధ్యతారాహిత్యమే.

వధువు అందంగా ముస్తాభై మండపంలో ఎదురుచూస్తోంది. బంధువులు, స్నేహితులు, పిల్లలు అందరూ కల్యాణ మండపంలో సందడి చేస్తున్నారు. కానీ, ఎంతకీ పెళ్లి కొడుకు ఆచూకీ లభించలేదు. ఫీటుగా తాగేసి మద్యం మత్తులో ఉన్న వరుడు ఆ రోజు తనకు పెళ్లి అన్న విషయమే మరిచిపోయాడు. అవును మీరు విన్నది నిజమే.. మద్యం మత్తులో ఇంటికి వెళ్లేటప్పుడు పరిచయస్తులను మరచిపోవడం సహజం. కానీ, ఈ తాగుబోతు పెళ్లి కొడుకు ఆ రోజు తన పెళ్లి అన్న విషయం మర్చిపోయాడు. ఇలాంటి వింత ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి అతిగా తాగి తన పెళ్లి అన్న సంగతి మర్చిపోయాడు. మత్తులో నిద్రలోకి జారుకున్న వరుడు కల్యాణ మండపానికి వెళ్లడం మర్చిపోయాడు.. ఈ ఘటన బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని సుల్తాన్‌గంజ్ గ్రామంలో చోటుచేసుకుంది.

పెళ్లికి ముందు రోజు రాత్రి వరుడు మద్యం సేవించాడు. మద్యం మత్తులో తన పెళ్లి అనే విషయంతో సహా అంతా మరిచిపోయాడు. దీంతో కల్యాణ మండపంలో ఎదురు చూసిన వధువు, తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుడు స్పృహలోకి రాగానే వధువు అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. తన బాధ్యతను అర్థం చేసుకోలేని వ్యక్తితో జీవితాన్ని గడపలేనని వధువు చెప్పింది. అంతే కాదు పెళ్లి ఏర్పాట్లకు ఖర్చు పెట్టిన డబ్బు కూడా తిరిగి ఇవ్వాలని వధువు కుటుంబీకులు వరుడి కుటుంబీకులను డిమాండ్‌ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణ వాతావరణాన్ని తలపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా.. పరిస్థితి అదుపులోకి వచ్చి సమస్య సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..