World Sleep Day: ఇదో పెద్ద సోమరిపోతు..! రోజులో 22గంటలు నిద్రపోతూనే ఉంటుంది..
ఇది ప్రపంచంలోనే అతి ఎక్కువ నిద్ర పోయే జంతువుగా పిలుస్తారు. కొంతమంది దీనిని ప్రపంచంలోని సోమరితనం జంతువులలో నెంబర్ వన్‌గా భావిస్తారు.
ప్రపంచ నిద్ర దినోత్సవం: ఈ జంతువు తన జీవితంలో ఎక్కువ భాగం నిద్రలో గడుపుతుంది, ఒక రోజులో చాలా గంటలు నిద్రపోతుంది. ప్రతి సంవత్సరం మార్చి మూడవ శుక్రవారాన్ని స్లీప్ డేగా జరుపుకుంటారు. దీన్నే ఇంగ్లీషులో ‘స్లీప్ డే’ అంటారు. నిద్ర సరిగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మారిన జీవనశైలి కారణంగా నిద్రలేమి ఏర్పడి ఆరోగ్య సమస్యలు చిన్నాపెద్ద అందరినీ వెంటాడుతున్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. ఇంతకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం పాడవడమే కాకుండా ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతారు. ప్రజలు నిద్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, ఆరోగ్యకరమైన నిద్రను పొందకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వారికి తెలియజేయడానికి మాత్రమే ప్రతి సంవత్సరం స్లీప్ డే జరుపుకుంటారు. రోజుకు 8 గంటల నిద్ర సరిగా లేకపోతే అది మిగతా 16 గంటల మెలకువ సమయాన్ని దెబ్బతీస్తుంది. నిద్ర సరిగా లేకపోతే మనిషి మెదడుపై దుష్ప్రాభావం పడుతుంది. అయితే, జీవితంలో ఎక్కువ భాగం నిద్రలోనే గడిపే జీవి ఒకటి ఈ ప్రపంచంలో ఉందని మీకు తెలుసా?
అవును ఈ జంతువు తన జీవిత కాలంలో ఎక్కువ భాగం నిద్రలోనే గడుపుతుంది. ఒక రోజులో చాలా గంటలు నిద్రపోతుంది. ఆ జంతువు పేరు కోలా. ఇది శాకాహార అడవి జంతువు. ఈ జంతువు తన జీవితంలో ఎక్కువ భాగం నిద్రలోనే గడుపుతుంది, ఒక రోజులో చాలా గంటలు నిద్రపోతుంది. కోలా అనేది చెట్లపై కనిపించే జంతువు. ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది. ఆస్ట్రేలియా తూర్పు భాగంలో యూకలిప్టస్ అడవులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఈ జంతువు విరివిగా కనిపిస్తుంది.
కోలాస్ ఒక రోజులో ఒక కిలో యూకలిప్టస్ ఆకులను తింటాయి. ఇది దాని ఏకైక, ప్రధాన ఆహారం. కోలాను ‘నో డ్రింకర్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది నీళ్లు తాగదు. ఆకులలో ఉండే తేమ నుండి మాత్రమే వాటి శరీరంలో నీరు సరఫరా అవుతుంది. 24 గంటల్లో 22 గంటలు నిద్రపోతుంది కోలా. ఇది ప్రపంచంలోనే అతి ఎక్కువ నిద్ర పోయే జంతువుగా పిలుస్తారు. కొంతమంది దీనిని ప్రపంచంలోని సోమరితనం జంతువులలో నెంబర్ వన్‌గా భావిస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ..