ఓరీ దేవుడో వీడు మనిషేనా..? మహిళ చంపి గుండెను ఫ్రై చేసి.. అత్తామామలకు భోజనం పెట్టాడు..
మరో కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లిన అతడు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. నెల రోజులు కూడా గడవకముందే ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో..
ముగ్గురిని అతి దారుణంగా హత్య చేసిన కేసులో దోషికి జీవిత ఖైదు విధించింది అమెరికా కోర్టు. అతడు చేసిన దారుణ హత్యల ఉదంతం తెలిస్తే ఒళ్లు గగ్గురుపొడిచేలా ఉంది. నిందితుడు మహిళను హత్య చేసి ఆమె గుండెను కోసి బంగాళాదుంపలతో వేయించి ఫ్రై చేశాడు. ఆ వంటకాన్ని అతని బంధువులకు వడ్డించాడు. ఆ తరువాత వారిని కూడా చంపేశాడు.. ఈ దారుణ హత్యకు పాల్పడిన నిందితుడికి అమెరికా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ అనే వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. మరో కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లిన అతడు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. నెల రోజులు కూడా గడవకముందే ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. ఈ ట్రిపుల్ మర్డర్ 2021లో జరిగింది. ఇప్పుడు కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది.
అతను జైలు నుండి విడుదలైన కొన్ని వారాల వ్యవధిలోనే ఆండ్రియా బ్లాంకెన్‌షిప్‌ను చంపి ఆమె గుండెను కోసి ఫ్రై చేసిన తన అత్త, మామలు వారి 4 ఏళ్ల మనవరాలు కేయోస్ యేట్స్‌లకు తినిపించేప్రయత్నం చేశాడు. అనంతరం వారిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. అతను ముందుగా హత్య చేసిన మహిళ గుండెను అతని భార్యకు కూడా తినిపించడానికి దుండగుడు ప్రయత్నించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
గతంలో డ్రగ్స్ కేసులో జైలుకెళ్లిన లారెన్స్ పాల్ ఆండర్సన్‌కు ఆ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ, సత్ప్రవర్తన కారణంగా అక్కడి ప్రభుత్వం అతని శిక్షను తగ్గించి జైలు నుంచి విడుదల చేసింది. అలా డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి 20 ఏళ్లు శిక్ష అనుభవించి కేవలం 3 ఏళ్లకే విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చినా బుద్ది మారలేదు. జైల్లోంచి బయటపడింది నెలరోజులు కూడా గడవకముందే ముగ్గురిని దారుణంగా హత్య చేసి మళ్లీ జైలుకు వెళ్లాడు. ట్రిపుల్ మర్డర్ కేసులో విచారించిన పోలీసుల ఎదుట అతడు తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో అమెరికా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..