Kohinoor Diamond: అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి.. ప్రదర్శనకు ‘కోహినూర్‌’ వజ్రం!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రానికి సంబంధించి ముఖ్యమైన వార్త ఇది. ఒకప్పుడు భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఈ వజ్రాన్ని మే నెలలో ‘టవర్ ఆఫ్ లండన్’లో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఎగ్జిబిషన్‌లో బ్రిటీష్ వారు ‘విజయ చిహ్నం’గా చూపించబోతున్నారు. బ్రిటన్ ప్యాలెస్‌ల నిర్వహణను పర్యవేక్షిస్తున్న హిస్టారిక్ రాయల్ ప్యాలెస్ (హెచ్‌ఆర్‌పి) సంస్థ ఈ వారం కోహినూర్ చరిత్రను కూడా ప్రదర్శనలో ఉంచనున్నట్లు తెలిపింది. విక్టోరియా మహారాణి వీలునామా ప్రకారం కోహినూర్ వజ్రాన్ని ఛార్లెస్ భార్య, ప్రస్తుత […]

Kohinoor Diamond: అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి.. ప్రదర్శనకు ‘కోహినూర్‌’ వజ్రం!
Kohinoor Diamond
Follow us

|

Updated on: Mar 17, 2023 | 6:19 PM

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రానికి సంబంధించి ముఖ్యమైన వార్త ఇది. ఒకప్పుడు భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఈ వజ్రాన్ని మే నెలలో ‘టవర్ ఆఫ్ లండన్’లో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఎగ్జిబిషన్‌లో బ్రిటీష్ వారు ‘విజయ చిహ్నం’గా చూపించబోతున్నారు. బ్రిటన్ ప్యాలెస్‌ల నిర్వహణను పర్యవేక్షిస్తున్న హిస్టారిక్ రాయల్ ప్యాలెస్ (హెచ్‌ఆర్‌పి) సంస్థ ఈ వారం కోహినూర్ చరిత్రను కూడా ప్రదర్శనలో ఉంచనున్నట్లు తెలిపింది.

విక్టోరియా మహారాణి వీలునామా ప్రకారం కోహినూర్ వజ్రాన్ని ఛార్లెస్ భార్య, ప్రస్తుత బ్రిటన్ మహారాణి కెమిల్లా దీన్ని తన కిరీటంలో ధరించాల్సి ఉంది. కానీ ఆమె ఈ కోహినూర్ ప్లేస్లో మరో వజ్రాన్ని ధరిస్తారని బకింగ్ హామ్ ఫ్యాలెస్ ఆల్రెడీ ప్రకటించింది. అందుకే ఇప్పడు కోమినూర్ వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు. దీన్ని ఇలా ప్రదర్శనలో పెట్టడం ఇదే మొదటిసారి. ఇదొక్కటే కాదు దీనితో పాటూ చాలా విలువైన వస్తువులను బకింగ్ హ్యామ్ ఫ్యాలెస్ వాళ్ళు ప్రదర్శనలో ఉంచుతున్నారు. మే 6వ తేదీన ఛార్లెస్ -3తో పాటు ఆయన భార్య కెమిల్లాకు పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు.

ఎలిజిబెత్ రాణి చనిపోయిన తర్వాత ఛార్లెస్ -3 రాజుగా బాధ్యతలు చేపడుతున్నారు. దీనికి గుర్తుగా లండన్ టవర్ లో మొత్తం రాజాభరణాలను ప్రదర్శనకు ఉంచుతున్నారు. దీంట్లో కోహినూర్ తో పాటూ పెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్, 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొన్న కలినన్ వజ్రం, ఇంపీరియల్ స్టేట్ క్రౌన్ లోని బ్లాక్ ప్రిన్స్ రూబీలను కూడా ప్రదర్శిస్తారు.

ఇవి కూడా చదవండి

పార్సీ భాషలో కోహినూర్ అంటే కాంతి పర్వతం అని అర్థం. ఈ వజ్రం చరిత్ర అనేక శతాబ్దాల నాటిది. ఇది కాకతీయ రాజవంశం పాలించిన సాయం కొల్లూరు గని నుండి వెలికితీసిందని నమ్ముతారు. తరువాత ఇది చాలా మంది పాలకుల చేతుల్లోకి వెళ్లింది. మహారాజా రంజిత్ సింగ్ ఖజానాలో చేరింది. అయితే విక్టోరియా రాణి భారతదేశానికి సామ్రాజ్ఞిగా చేయడానికి కొన్ని సంవత్సరాల ముందు ఇది అతని ఆధీనంలోకి వచ్చింది. గతంలో బ్రిటన్‌లో జరిగిన పట్టాభిషేకాల్లో ఈ వజ్రం సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం