పెళ్లికి వచ్చి ఇదేం పాడుపని రా అయ్యా.. పోలీసుల ఎంట్రీతో శుభం కార్డు
పెళ్లి వేడుక జరుగుతోంది. ఆత్మీయ పలకరింపులు బంధు మిత్రుల కోలాహలంతో పెళ్లి మండపంలో సందడి వాతావరణం నెలకొంది. అందరూ వివాహ కార్యక్రమంలో నిమగ్నమై పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు.

పెళ్లి వేడుక జరుగుతోంది. ఆత్మీయ పలకరింపులు బంధు మిత్రుల కోలాహలంతో పెళ్లి మండపంలో సందడి వాతావరణం నెలకొంది. అందరూ వివాహ కార్యక్రమంలో నిమగ్నమై పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. కాని ఒక్కసారిగా వివాహానికి హాజరైన వారు ఉలిక్కిపడేలా చేసింది . పెళ్లి కోసం తీసుకువచ్చిన బంగారం కనిపించక పోవటంతో పెళ్లివారు దిగ్భ్రాంతికి గురయ్యారు. సుమారు రూ. 20 లక్షల విలువ చేసే బంగారం కనిపించకపోవటంతో వధూవరుల కుటుంబంలో ఆందోళన మొదలైంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో జరిగింది ఈ ఘటన. నగల కోసం పెళ్లి మండపం పరిసర ప్రాంతాల్లోని అన్ని చోట్ల వధువరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వెతకడం ప్రారంభించారు. కాని ఎంతవేతికినా ఆ నగల ఆచూకి లభించలేదు. చివరికి చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పెళ్లి మండపాన్ని పరిశీలించారు. అయితే చోరీకి గురైన ఆభరణాలు సుమారు 50 సవర్ల వరకు ఉంటాయని వధూవరుల కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కళ్యాణ మండపంలో పని చేసే వారిని, చుట్టుపక్కల ఉన్న దుకాణదారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. నగలు చోరీకి గురైనట్లు గుర్తించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే చివరికీ ఓ వ్యక్తి వద్ద నగలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆభరణాలను స్వాధీనం చేసుకుని.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బంగారు నగలు పోయిన గందరగోళ పరిస్థితుల్లోనే వధువరుల కుటుంబ సభ్యులు పెళ్లి తంతు ముగించేశారు. చివరికీ పోయిన నగలు వెంటనే దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసును వెంటనే ఛేదించి బంగారం అప్పగించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..