Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాకు షాక్.. మరో 5 రోజుల కస్టడీ పొడగింపు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏడు రోజులు కస్టడీ కావాలని ఈడీ కోరగా..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏడు రోజులు కస్టడీ కావాలని ఈడీ కోరగా.. 5 రోజులకు అంగీకరించింది న్యాయస్థానం. ఇదే ఇష్యూపై రెండుసార్లు సిసోడియా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మనీలాండరింగ్ అని చెప్పడానికి తగిన ఒక్క లావాదేవీని కూడా ఇంత వరకు గుర్తించలేదని చెప్పారు. అలాగే 7 రోజుల కస్టడీలో కేవలం 11 గంటల పాటు మాత్రమే విచారణ జరిగిందని తెలిపారు. ఈ 11 గంటల్లో నలుగురితో కన్‌ఫ్రంటేషన్ చేశారని.. మళ్లీ కస్టడీ అవసరం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు కేసు కీలక దశకు చేరినందున కస్టడీ అవసరమని వాదించింది ఈడీ. రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మరో ఐదు రోజులు కస్టడీ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..