Hair Care Tips: జుట్టు విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు.. బోడగుండు అయిపోతుంది..!

దట్టమైన, బలమైన, పొడవాటి జుట్టు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ తమకు అందమైన, ఆకర్షణీయమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. అందుకే చాలా మంది తమ జుట్టును సంరక్షించుకునేందుకు

Hair Care Tips: జుట్టు విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు.. బోడగుండు అయిపోతుంది..!
Hair Fall
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 16, 2023 | 5:04 PM

దట్టమైన, బలమైన, పొడవాటి జుట్టు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ తమకు అందమైన, ఆకర్షణీయమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. అందుకే చాలా మంది తమ జుట్టును సంరక్షించుకునేందుకు రకరకాల నూనెలు, ప్రోడక్ట్స్ వాడుతుంటారు. కొందరు హోమ్ రెమెడీస్‌ని కూడా పాటిస్తుంటారు. అయితే, కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు సంబంధిత సమస్యలు వదలవు. మళ్లీ మళ్లీ ఆ సమస్యలు వేధిస్తుంటాయి. అయితే, జుట్టు విషయంలో తెలిసి, తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. వాటి వల్ల అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే ముందుగా జుట్టుకు సంబంధించిన సమస్యలేంటి? ఆ సమస్యలను ఎలా నివారించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జుట్టుపై ఈ ప్రయోగాలు అస్సలు వద్దు..

1. జుట్టును తరచుగా దువ్వడం మానుకోవాలి. ఎక్కువగా దువ్వడం వల్ల జుట్టు బలహీనపడటమే కాకుండా జిడ్డుగా మారుతుంది. చిక్కుబడ్డ జుట్టును విడదీయడానికి వెడల్పాటి పళ్ల దువ్వెనను ఉపయోగించాలి.

2. షాంపూ వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఎక్కువగా హెయిర్ వాష్ చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అలాగని, ఎక్కువ కాలం జుట్టును కడగకుండా ఉండకూడదు. ఎక్కువ సేపు జుట్టును క్లీన్ చేయడం వల్ల కూడా కుదుళ్లు బలహీనపడుతాయి. ఇది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది. అందుకే ప్రతి మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

3. హెయిర్ డ్రైయర్‌ని ఎక్కువగా ఉపయోగించొద్దు. ఇది మీ జుట్టుకు హాని కలిగిస్తుంది.

4. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వొద్దు. ఫలితంగా జుట్టు విరిగిపోతుంది. జుట్టును ఆరిన తరువాత దువ్వాలి.

5. దువ్వెనలు, స్టైలింగ్ పరికరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఎందుకంటే వాటిపై పేరుకున్న మురికి జుట్టును పాడు చేస్తుంది. దువ్వెనలు, బ్రష్‌లను కనీసం వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. కొన్ని నెలల ఉపయోగం తర్వాత వాటిని రీప్లేస్ చేయడం మంచిది. లేదంటే.. అవి తలపై ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.

6. జుట్టు విరబోసి ఎప్పుడూ నిద్రపోవద్దు. జుట్టు చిక్కుపడే ప్రమాదం ఉంది.

7. సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుపై దుష్ప్రభావం చూపుతుంది.

8. తడి జుట్టుతో నిద్రపోవద్దు. జుట్టు ఆరిన తరువాతే నిద్రపోవాలి. లేదంటే.. ఉదయం పూట ఆ జుట్టు అనేక చిక్కులు పడుతుంది. వాటిని విడదీయాలంటే పెద్ద టాస్క్ మాదిరి అవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..