AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ్‌ చరణ్‌ బర్త్‌ డే స్పెషల్‌.. థియేటర్లలో రీ రిలీజ్‌ కానున్న చెర్రీ సినిమా.. కలెక్షన్లతో ఏం చేయనున్నారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, సూపర్‌ హిట్లు ఉండచ్చు. అయితే అతని కెరీర్‌లో ఆరెంజ్‌ సినిమాకు ప్రత్యేక స్థానముంటుంది. ఎందుకంటే..

రామ్‌ చరణ్‌ బర్త్‌ డే స్పెషల్‌.. థియేటర్లలో రీ రిలీజ్‌ కానున్న చెర్రీ సినిమా.. కలెక్షన్లతో ఏం చేయనున్నారంటే?
Ram Charan
Basha Shek
| Edited By: |

Updated on: Mar 17, 2023 | 8:18 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, సూపర్‌ హిట్లు ఉండచ్చు. అయితే అతని కెరీర్‌లో ఆరెంజ్‌ సినిమాకు ప్రత్యేక స్థానముంటుంది. సాధారణంగా హిట్‌ అయిన సినిమాలు ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకుంటారు. అయితే డిజాస్టర్‌ అయిన మూవీస్‌కు కూడా ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఉంటారనేందుకు ఆరెంజ్‌ మూవీ ప్రత్యక్ష ఉదాహరణ. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో మెగా బ్రదర్ నాగబాబు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. మగధీర తర్వాత భారీ అంచనాలతో 2010లో విడుదలైన ఈ సినిమా ప్లాఫ్‌గా నిలిచింది. ప్రేమకథా చిత్రాల్లో ఓ సరికొత్త కణాన్ని ఆవిష్కరిస్తూ పూర్తి ఫారిన్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఆరెంజ్‌ను తెరకెక్కించారు.  ఇందులోని పాటలైతే ఓ రేంజ్‌లో హిట్టయ్యాయి. ఇక రామ్ చరణ్ యాక్టింగ్ అదిరిపోయింది. అయితే ఎందుకో కానీ ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేకపోయింది. అయితే సిల్వర్‌ స్ర్కీన్‌పై ఫెయిల్యూర్‌గా మిగిలిన ఈ సినిమా బుల్లితెర, యూట్యూబ్‌లలో మాత్రం అదరగొట్టింది. టీవీలో ఈ సినిమా వస్తే ఇప్పటికీ కళ్లప్పగించుకుని మరీ చూస్తుంటారు. అంతేకాదు ఆరెంజ్‌ ఇప్పుడు రావాల్సిన ఈ మూవీ అని.. అయితే ఎప్పుడో 15 ఏళ్ల కింద వచ్చిందని, అదే సినిమాకు మైనస్ అనే చాలామంది చెబుతుంటారు. అలాంటి ఆరెంజ్ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయిన రామ్‌చరణ్‌ మార్చి 27న పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఇందులో భాగంగా చరణ్‌ బర్త్‌డే కానుకగా ఆరెంజ్‌ను రీ రిలీజ్‌ను చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ ద్వారా వచ్చే కలెక్షన్లను జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నిర్మాత, మెగా బ్రదర్‌ నాగబాబు ఆలోచిస్తున్నారట. మరి యూత్‌ను బాగా మెప్పించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ ఈసారైనా థియేటర్లలో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. కాగా రామ్‌ చరణ్‌ బర్త్‌డేకు ముందుగా మగధీరను రిలీజ్‌ చేద్దామనుకున్నారు. అయితే ఎందుకో అది సాధ్యపడలేదు. ఇప్పుడీ సినిమా స్థానంలో ఆరెంజ్‌ను థియేటర్లలోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో