AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: మాస్క్ ఈజ్ బ్యాక్ అంటున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? పాన్‌ ఇండియా రేంజ్‌లో ఫేమస్

మాస్క్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది ఓ హీరోయిన్‌. పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ  90వ దశకంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది.  తన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.

Actress: మాస్క్ ఈజ్ బ్యాక్ అంటున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? పాన్‌ ఇండియా రేంజ్‌లో ఫేమస్
Actress
Basha Shek
|

Updated on: Mar 18, 2023 | 5:59 PM

Share

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. కరోనాకు తోడు H3N2 లాంటి కొత్త కొత్త వైరస్‌లు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో అందరూ మళ్లీ వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించారు. ముఖానికి మాస్క్ పెట్టుకుంటున్నారు. శానిటైజేషన్‌, సామాజిక దూరాన్ని ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో సినిమా సెలబ్రిటీలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మాస్క్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది ఓ హీరోయిన్‌. పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ  90వ దశకంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది.  తన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి స్టార్‌ స్టేటస్ సొంతం చేసుకుంది. అన్నట్లు తెలుగులోనూ ఈమెకు బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉందండోయ్‌. గతంలో బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబులతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న ఈ సొగసరి ఇప్పటికీ పాన్‌ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ తెచ్చుకుంటోంది. మరి మాస్క్‌లో ఉన్నప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తోన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదు..

కేజీఎఫ్‌తో పాన్‌ ఇండియా పాపులారిటీ సొంతం చేసుకున్న బాలీవుడ్ అందాల తార రవీనా టాండన్‌. 90వ దశకంలో స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన ఈ అందాల తార తెలుగులో బాలకృష్ణతో బంగారు బుల్లోడు, నాగార్జునతో ఆకాశవీధిలో, మోహన్‌బాబుతో కలిసి పాండవులు పాండవులు తుమ్మెద వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం స్పెషల్‌ రోల్స్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సందడి చేస్తోంది. రాకింగ్‌ స్టార్‌ యశ్ కేజీఎఫ్‌ సిరీస్‌లో రవీనా పోషించిన రమికాసేన్‌ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. తన తదుపరి సినిమా షూటింగ్‌ కోసం వెళుతూ ముంబై ఎయిర్‌ పోర్టులో తళుక్కుమందీ అందాల తార. మాస్క్‌ ధరించి కెమెరాలకు కనిపించింది. ఈ సందర్భంగా కొందరు అభిమానులు ఆమెను గుర్తుపట్టి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. ఆమెతో కలిసి ఫొటోలు దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us