Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: దాస్‌ కా ధమ్కీ ఈవెంట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా జూనియర్‌ ఎన్టీఆర్ స్టైలిష్‌ హుడీ.. ధర ఎంతో తెలుసా?

చాలామంది తమ అభిమాన హీరోలు, క్రికెటర్లను ఫాలో అవుతుంటారు. ఇందుకోసం వారి లైఫ్‌స్టైల్‌తో పాటు డ్రెస్సులు, వాచెస్‌, యాక్సెసరీస్‌పై దృష్టి సారిస్తుంటారు. అలాంటి వస్తువుల ధరలు, తదితర వివరాలు తెలుసుకునేందుకు తెగ తాపత్రయ పడుతుంటారు.

Jr NTR: దాస్‌ కా ధమ్కీ ఈవెంట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా జూనియర్‌ ఎన్టీఆర్ స్టైలిష్‌ హుడీ.. ధర ఎంతో తెలుసా?
Jr Ntr
Follow us
Basha Shek

|

Updated on: Mar 18, 2023 | 8:04 PM

మన దేశంలో సినిమా హీరోలు, క్రికెటర్లకు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంటుంది. ఇక సోషల్‌ మీడియాలో అయితే ఈ స్టార్ సెలబ్రిటీల క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అంతే. చాలామంది తమ అభిమాన హీరోలు, క్రికెటర్లను ఫాలో అవుతుంటారు. ఇందుకోసం వారి లైఫ్‌స్టైల్‌తో పాటు డ్రెస్సులు, వాచెస్‌, యాక్సెసరీస్‌పై దృష్టి సారిస్తుంటారు. అలాంటి వస్తువుల ధరలు, తదితర వివరాలు తెలుసుకునేందుకు తెగ తాపత్రయ పడుతుంటారు. అలా ఇప్పుడు తారక్‌ ధరించిన హుడీ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం (మార్చి 17) విశ్వక్‌ సేన్‌ సినిమా దాస్‌ కా ధమ్కీ ఈవెంట్‌కు తారక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతను ధరించిన హుడీ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆ స్టైలిష్‌ హుడీ ధర, ఇతర వివరాల గురించి నెట్టింట్లో వెతుకులాట మొదలుపెట్టారు. దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్లాక్ హుడీ ధరించి పాల్గొన్నాడు. ఆ హుడీపై బ్లాక్ అండ్ వైట్‌ షేడింగ్ లో ఫైర్‌ డిజైన్స్‌ గ్రాఫిక్‌ ప్రింటింగ్‌ ఉంది. ఇది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తో పాటు అందిరినీ ఆకట్టుకుంది. ఇక ఈ హుడీ ధర విషయానికి వస్తే.. ఇది ఓనిట్సుకా టైగర్ అనే వెబ్ సైట్ లో 170 యూరోస్ కి అందుబాటులో ఉంది. అంటే దాదాపుగా మన కరెన్సీలో రూ.15 వేలు వరకు ఉంటుంది.

కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు తారక్‌. ఆస్కార్‌ అవార్డు కూడా రావడంతో ఎన్టీఆర్‌ క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు తారక్‌. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ హీరోయిన్‌ గా ఫైన్‌లయ్యింది. బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి అనిరుదు రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ నెలాఖరులోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..