Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukh Jaswanth: అరే ఏంట్రా ఇది.. దీపు చూస్తే చాలా ఫీలవుతుంది.. నెట్టింట్లో వైరల్‌గా షణ్ముఖ్‌ రొమాంటిక్‌ వీడియో

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి మరింత క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపించినప్పటికీ కొన్ని కారణాలతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు

Shanmukh Jaswanth: అరే ఏంట్రా ఇది.. దీపు చూస్తే చాలా ఫీలవుతుంది.. నెట్టింట్లో వైరల్‌గా షణ్ముఖ్‌ రొమాంటిక్‌ వీడియో
Shanmukh Jaswant
Follow us
Basha Shek

|

Updated on: Mar 19, 2023 | 8:53 PM

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి మరింత క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపించినప్పటికీ కొన్ని కారణాలతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. కాగా బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్ సిరి హన్మంత్‌తో వ్యవహరించిన తీరు చాలామందిని విస్మయపరిచింది. అప్పటికే దీప్తి సునైనాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న జస్వంత్ బిహేవియర్‌పై అతని ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. దీనికి నొచ్చుకున్న దీప్తి కూడా తమ సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ షణ్ణూకు బ్రేకప్ చెప్పేసింది. ఇక తమదారులు వేరని, కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆతర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు. ఎవరికీ వారే సొంతగా యూట్యూబ్‌ సాంగ్స్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా షణ్ణూ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

వివరాల్లోకి వెళితే ‘అయ్యయ్యో’ పేరుతో ఓ రొమాంటిక్ సాంగ్‌ వీడియోను రిలీజ్ చేశాడు షణ్ముక్. ఇక ఈ మ్యూజిక్ వీడియోకు వినయ్ షణ్ముఖ్ దర్శకత్వం వహించగా ది ఫాంటిసియా మ్యాన్ సంగీతం అందించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఇందులో ఫణి పూజిత అనే అమ్మాయితో ఫుల్ రొమాంటిక్‌గా నటించాడు షణ్ణూ. అమ్మాయికి ముద్దులు పెడుతూ రెచ్చిపోయాడు. ఇప్పుడిదే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. షణ్ముక్ ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌ ‘అరే.. ఏంట్రా ఇది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది చాలా టూమచ్ బ్రో, ఈ వీడియో చూస్తే దీప్తి బాధపడుతుంది బ్రో’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..