అద్దం ముందు హొయలు పోతోన్న ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడకెళ్లినా ఫుల్ క్రేజ్..
ఇందులో అద్దం ముందు పోజులిస్తున్నది ఓ స్టార్ హీరోయిన్. తెలుగులో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తమిళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది.
సినిమా తారలు తమకు సంబంధించిన ఏ విషయమైనా షేర్ చేసుకోవాలంటే సామాజిక మాధ్యమాలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానే తమ ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలు పంచుకుంటున్నారు. పైగా వీటితో ఫ్యాన్స్‌తో కూడా టచ్‌లో ఉండవచ్చు. ఈక్రమంలో పై ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులో అద్దం ముందు పోజులిస్తున్నది ఓ స్టార్ హీరోయిన్. తెలుగులో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తమిళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇవీ చాలదన్నట్లు బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులు దక్కించుకుంటోంది. అన్నట్లు నెట్టింట్లోనూ ఆమెకు ఫుల్ పాపులారిటీ. తను షేర్ చేసే గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలకు అభిమానులు, ఫాలోవర్ల, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. అలా తాజాగా మరొక ఫొటో షేర్ చేసిందామె. ఇందులో బ్లూ ప్రింటెడ్ డెనిమ్ జాకెట్, బ్లూ జీన్స్ ధరించి అద్దం ముందు హొయలు పోయింది. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది. మరి ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదు..
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో టాలీవుడ్‌లోకి రివ్వును దూసుకొచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ సొగసరి తాజాగా తన వర్క్ ప్లేస్ లో ఎలా ఉంటుందో చూపించేందుకు కొన్ని ఫొటోలను పంచుకుంది. ఆ ఫొటోల్లో రకుల్ మేకప్ రూమ్ లో అల్లరి చేస్తూ కనిపించింది. కాఫీ కప్ చేతిలో పట్టుకొని.. ఫొటోలకు చిలిపిగా ఫోజులిచ్చింది. ‘వర్క్ ప్లేస్ లో ఇలా కాఫీని ఎంజాయ్ చేస్తున్నా’ అని తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కమలహాసన్‌తో ఇండియన్ 2లో నటిస్తోంది. అలాగే హిందీలో ‘మేరీ పత్నీ కా రీమేక్’, ‘అయలాన్’, ’31 అక్టోబర్ లేడీస్ నైట్’ వంటి సినిమాలతో అలరించబోతుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..