IND vs AUS: లుంగీ డ్యాన్స్‌తో అదరగొట్టిన కోహ్లీ.. ఫ్యాన్స్ హర్షధ్వానాలతో మార్మోగిన గ్రౌండ్.. వీడియో వైరల్‌

మిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్‌ఫీల్డ్‌లో ఎంత నిక్కచ్చిగా ఉండాలో ఆఫ్‌ ఫీల్డ్‌లో ఎంతో సరదాగా ఉంటాడు. సీనియర్లతో అయినా, జూనియర్లతో అయినా ఎంతో కలివిడిగా ఉంటాడు. పాటలు పాడుతాడు. డ్యాన్సులు చేస్తాడు.

IND vs AUS: లుంగీ డ్యాన్స్‌తో అదరగొట్టిన కోహ్లీ.. ఫ్యాన్స్ హర్షధ్వానాలతో మార్మోగిన గ్రౌండ్.. వీడియో వైరల్‌
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Mar 22, 2023 | 5:15 PM

చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేకు ముందు టీమిండియా చాలా చిల్ మూడ్‌లో కనిపించింది.సిరీస్ విజేత ఎవరో చెన్నైలోనే తేలాల్సి ఉన్నా, గత మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైనప్పటికీ ఆటగాళ్లు ఎంతో సరదాగా కనిపించారు. ఇక టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్‌ఫీల్డ్‌లో ఎంత నిక్కచ్చిగా ఉండాలో ఆఫ్‌ ఫీల్డ్‌లో ఎంతో సరదాగా ఉంటాడు. సీనియర్లతో అయినా, జూనియర్లతో అయినా ఎంతో కలివిడిగా ఉంటాడు. పాటలు పాడుతాడు. డ్యాన్సులు చేస్తాడు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటునాటు పాటకు కాలు కదిపిన విరాట్‌ కోహ్లీ..  తాజాగా చెన్నైలో జరుగుతున్న మూడో వన్డేలోనూ మరోసారి తన డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌ను చూపించాడు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ సూపర్‌ హిట్‌ మూవీ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని లుంగీ డ్యాన్స్‌కు స్టెపులు వేశాడు. ఫీల్డింగ్‌కు వెళ్లే ముందు టీమ్‌ మీటింగ్‌కి ముందు కోహ్లీ లుంగీ డ్యాన్స్‌కు స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇ క మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌ ఆస్ట్రేలియాకు మరోసారి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. అయితే ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. ట్రావిస్‌ హెడ్‌ (33), మిచెల్‌ మార్ష్‌ (47), స్టీవ్‌స్మిత్‌(0)లను ఔట్‌ చేసి కంగారూలకు షాకిచ్చాడు. కడపటి వార్తలందే సమయానికి ఆసీస్‌ 42 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..