IND vs AUS: ఇక బ్యాటర్లదే భారం.. చెన్నై మ్యాచ్‌లో రాణించిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?

సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే చెన్నై వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు సమష్ఠిగా రాణించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను బాగానే కట్టడి చేశారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది.

IND vs AUS: ఇక బ్యాటర్లదే భారం.. చెన్నై మ్యాచ్‌లో రాణించిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Mar 22, 2023 | 6:35 PM

సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే చెన్నై వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు సమష్ఠిగా రాణించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను బాగానే కట్టడి చేశారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (47) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్‌ క్యారీ (38), ట్రావిస్‌ హెడ్‌ (33), లబూషేన్‌ (28), సీన్‌ అబాట్‌ (26), స్టొయినిస్‌ (25), వార్నర్‌ (23) పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా (44/3), కుల్దీప్‌ యాదవ్ (56/3) తలా మూడు వికెట్ల పడగొట్టగా.. అక్షర్‌ 2, సిరాజ్‌ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే భారత్ బరిలోకి దిగగా.. ఆస్ట్రేలియా ఒక మార్పు చేసింది. ఆల్‌ రౌండర్‌ క్యామెరూన్‌ గ్రీన్ స్థానంలో డేవిడ్ వార్నర్‌ను తుది జట్టులోకి తీసుకుంది. గత మ్యాచ్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. 10.5 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఈ తరుణంలో హెడ్ (33)ను ఔట్ చేసి హర్దిక్‌ పాండ్యా భారత్‌కు మొదటి వికెట్‌ అందించాడు.

కాసేపటికే స్టీవ్ స్మిత్ (0), మిచెట్ మార్ష్ (47) వికెట్లు తీసి ఆసీస్‌ను మళ్లీ దెబ్బతీశాడు. డేవిడ్ వార్నర్ (23), లాబుషేన్ (28), స్టొయినిస్ (25), అలెక్స్ కార్వీ (38), సీన్ అబ్బాట్ (26) నిలకడగా ఆడినా భారీస్కోర్లు చేయలేకపోయారు. టాప్‌ ఆర్డర్‌ను హార్ధిక్ పాండ్యా దెబ్బతీయగా.. కుల్దీప్ యాదవ్ దెబ్బకు మిడిల్ ఆర్డర్ కకావికలమైంది. పాండ్యా, కుల్దీప్ తలో మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే