AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ సినిమాలో శ్రీదేవి ఉన్నా నాకే అవార్డ్స్ వచ్చాయి.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..

దశాబ్దాలుగా సినీరంగంలో కథానాయికగా, నటిగా తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లుగా నటించి.. ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న తారలు చాలా మంది ఉన్నారు.

Tollywood : ఆ సినిమాలో శ్రీదేవి ఉన్నా నాకే అవార్డ్స్ వచ్చాయి.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
Sridevi
Rajitha Chanti
|

Updated on: Mar 11, 2026 | 12:26 PM

Share

ప్రముఖ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సంవత్సరాలుగా సినీరంగంలో కథానాయికగా, సహయ నటిగా రాణిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత అనుభవాలపై అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్ మొదటి రోజుల్లో ఆర్థిక నిర్వహణ, వివిధ దర్శకులతో పని చేసిన అనుభవాలు, అలాగే అగ్ర నటీమణులు శ్రీదేవి, జయప్రదలతో ఉన్న పోటీతత్వం గురించి ఆమె మాట్లాడారు. తన మొదటి రెమ్యూనరేషన్ రూ.5000 అని జయసుధ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమని, చెక్ అందుకున్న తర్వాత తన తండ్రికి అందజేశానని తెలిపారు. ఆ రోజు సాయంత్రం చెన్నైలోని మెరీనా బీచ్‌కి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లి, సంతోషంగా గడిపిన క్షణాలను వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్

కెరీర్ తొలినాళ్లలో తండ్రి అన్నీ చూసుకునేవారని, పెద్దగా పొదుపు చేయడం వంటివి తెలియవని చెప్పారు. దాదాపు 40 ఏళ్ల వయస్సులో మాత్రమే తాను బ్యాంకింగ్ వ్యవహారాలను నేర్చుకోవడం ప్రారంభించానని అన్నారు. నటిగా తనను తీర్చిదిద్దిన శిల్పు ముగ్గురు దిగ్దర్శకుల గురించి చెబుతూ.. కె.బాలచందర్ తనను సహజ నటనకు ప్రోత్సహించారని, ఆయన చిత్రాలు కమర్షియల్ ధోరణికి భిన్నంగా ఉండేవని వివరించారు. బాలచందర్ పాఠశాల నుండి వచ్చిన కమల్ హాసన్ వంటి నటులతో కలిసి తాను పెరిగానని, ఆ ప్రభావంతో సహజమైన, బలమైన పాత్రలను చేయాలనే కోరిక తనలో కలిగిందని పేర్కొన్నారు. తర్వాత కె. రాఘవేంద్ర రావు సినిమాల్లో నటించడం ఒక కొత్త ప్రయాణమని, ఆయన సాంకేతికంగా మెరుగైన, గ్లామరస్ పాత్రలను అందించారని తెలిపారు. బాలచందర్ శైలిని అనుసరించకుండా, తనదైన శైలిలో మరింత గ్లామర్‌ను జోడించి చిత్రాలు తీశారని జయసుధ పేర్కొన్నారు. ఇక దాసరి నారాయణరావు చిత్రాలు మహిళా ప్రాధాన్యతతో, శక్తివంతమైన పాత్రలతో తనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయని చెప్పారు. స్త్రీల జీవితంలోని వివిధ షేడ్స్‌ను దాసరి అద్భుతంగా ఆవిష్కరించారని ఆమె ప్రశంసించారు.

ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..

తోటి హీరోయిన్స్ శ్రీదేవి, జయప్రదలతో పోటీ గురించి మాట్లాడుతూ.. తాను కేవలం తన నటనకు మాత్రమే గుర్తింపు రావాలని కోరుకునేదానినని స్పష్టం చేశారు. “ఆ అమ్మాయికి ఎన్ని పాటలు ఉన్నాయి, ఎంత గ్లామర్‌గా చూపిస్తారు అనేది నాకు అనవసరం. థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు జయసుధ బాగా యాక్ట్ చేసింది అనాలి” అని భావించానని అన్నారు. ప్రేమాభిషేకం సినిమాలో శ్రీదేవితో కలిసి నటించిన సందర్భాన్ని జయసుధ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రంలో ఒక ప్రాస్టిట్యూట్ పాత్రను, మేకప్ లేకుండా నటించడానికి దర్శక, నిర్మాత నరసింహారావు తొలుత సంకోచించారని, కానీ దాసరి నారాయణరావు ఒప్పించారని తెలిపారు. శ్రీదేవి పక్కన మేకప్ లేకుండా నటించి, తన నటనకు ఉత్తమ ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులు గెలుచుకున్నానని, అది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని జయసుధ వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

Sridevi, Jayasudha

Sridevi, Jayasudha

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

Follow Us