ఐసీసీ ర్యాంకింగ్స్‌.. నంబర్‌ వన్‌ ప్లేస్‌ కోల్పోయిన హైదరాబాదీ పేసర్‌.. టాప్‌ ప్లేస్‌లోకి ఎవరొచ్చారంటే?

ఐసీసీ కొత్త వన్డే బౌలర్ల ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. ఈసారి ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో నిలిచాడు. గత నెల రోజులుగా నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 2 స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్‌కు పడిపోయాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌.. నంబర్‌ వన్‌ ప్లేస్‌ కోల్పోయిన హైదరాబాదీ పేసర్‌.. టాప్‌ ప్లేస్‌లోకి ఎవరొచ్చారంటే?
Mohammed Siraj
Follow us
Basha Shek

|

Updated on: Mar 22, 2023 | 8:58 PM

ఐసీసీ కొత్త వన్డే బౌలర్ల ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. ఈసారి ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో నిలిచాడు. గత నెల రోజులుగా నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 2 స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. జనవరి 25న ఐసీసీ ప్రచురించిన వన్డే బౌలర్ ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్ 5 మ్యాచ్‌ల్లో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో సిరాజ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 2 స్థానాలు దిగజారిపోయాడు. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(708 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సిరాజ్‌(702) పాయింట్లతో ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి మూడో స్ధానంలో నిలిచాడు. కాగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో సిరాజ్‌ అద్భుతంగా రాణిస్తే.. మళ్లీ టాప్‌ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది.

వన్డేల్లో టాప్‌-10 బౌలర్ల లిస్టు ఇదే..

1. జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- 713 పాయింట్లు

2. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)- 708 పాయింట్లు

ఇవి కూడా చదవండి

3. మహ్మద్ సిరాజ్ (భారత్)- 702 పాయింట్లు

4. మిచెల్‌ స్టార్క్‌ (ఆస్ట్రేలియా)- 702 పాయింట్లు

5. రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్)- 659 పాయింట్లు

6. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 648 పాయింట్లు

7. షాహీన్ ఆఫ్రిది (పాకిస్థాన్)- 641 పాయింట్లు

8. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్థాన్)- 637 పాయింట్లు

9. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా)- 633 పాయింట్లు

10. మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్)- 631 పాయింట్లు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..