Suman: పవన్‌ కల్యాణ్‌ ఫాలోయింగ్‌ అద్భుతం.. అప్పుడే ఆయన సీఎం అవుతారు.. నటుడు సుమన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుసగా సినిమాలు చేస్తూనే జనసేన అధ్యక్షుడిగా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. అయితే పవన్ కళ్యాణ్‌ రెండు పడవల ప్రయాణంపై కొందరి నుంచి వ్యతిరేకత ఎదురవుతుంటే మరికొంత మంది నుంచి సానుకూంగా స్పందిస్తున్నారు.

Suman: పవన్‌ కల్యాణ్‌ ఫాలోయింగ్‌ అద్భుతం.. అప్పుడే ఆయన సీఎం అవుతారు.. నటుడు సుమన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan, Suman
Follow us

|

Updated on: Mar 23, 2023 | 12:40 PM

వరుసగా సినిమాలు చేస్తూనే జనసేన అధ్యక్షుడిగా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. అయితే పవన్ కళ్యాణ్‌ రెండు పడవల ప్రయాణంపై కొందరి నుంచి వ్యతిరేకత ఎదురవుతుంటే మరికొంత మంది నుంచి సానుకూంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పవన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్‌ పవన్‌ రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. బుధవారం (మార్చి 22) గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆల్ ఇండియా సుమన్ యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటుచేసిన 2023 సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించి పలు విషయాలపై మాట్లాడారు. ఇందులో భాగంగానే జనసేన అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘పవన్ కల్యాణ్‌కు ఫాలోయింగ్ అద్భుతంగా ఉంది. ఎక్కడికెళ్లినా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ఆయన అదృష్టమని చెప్పుకోవాలి. అయితే రాజకీయాలైనా, వ్యాపారాల్లోనైనా రాసిపెట్టి ఉండాలి. పవన్ కల్యాణ్‌, నేను మాత్రమే యాక్టర్స్ కాదు.. మీరంతా యాక్టర్లే. మనకు భగవంతుడు కొన్ని పనులు అప్పజెప్పాడు. మీరు చేసే పనులు నేను చేయలేను.. నేను చేసే పనులు మీరు చేయలేరు. ఒకరు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయనకు రాసిపెట్టి ఉంటుంది. ఒడిశాలో పట్నాయక్ ఐదోసారి సీఎం అయ్యారు. 25 ఏళ్లుగా నిరంతరాయంగా ఆయన సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన సీఎం అవ్వాలని ఆల్‌రెడీ రాసి ఉంది. పవన్‌ కల్యాణ్‌ సీఎం అవ్వడానికి కూడా టైమ్‌ రావాలి. రాసి పెట్టి ఉంటే ఆయన కచ్చితంగా సీఎం అవుతారు’ అని సుమన్‌ చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌కే నా మద్దతు..

కాగా పవన్‌ సీఎం సీటులోకి రావాలంటే చాలా సమీకరణాలుంటాయని కూడా సుమన్‌ చెప్పుకొచ్చారు. ‘ పవన్‌ ఎప్పుడు క్లిక్‌ అవుతారు. ఆయనకు ఎప్పుడు ఒక మంచి పొజిషన్‌ వస్తుంది అనే వాటికి చాలా సమీకరణాలు ఉంటాయి. ఈ మనిషి వస్తే మనందరం బాగుంటాం అని జనం మనసులో ఎప్పుడు పడుతుందో.. ఆ టైమ్ వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఒక ఆర్టిస్టుగా పవన్‌కు నేను శుభాకాంక్షలు చెబుతున్నాను. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకొని రాజకీయాల్లో రాణించాలి’ అని సూచించారు సుమన్‌. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సుమన్ తెలిపారు. ‘ఐటీ రంగంలో బెంగళూరుకు ధీటుగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఇటీవల కాలంలో బెంగళూరును కూడా వెనక్కి నెట్టి హైదరాబాద్ ప్రపంచ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది దిశగా దూసుకుపోతోంది.ఆ అభివృద్ధికి నా సంపూర్ణ మద్దతు’ అని సుమన్ పేర్కొన్నారు. మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..