Dasara: ‘ఛమ్‌కీలా అంగీలేసి’ పాటకు నాని సతీమణి డ్యాన్స్‌.. నజ్రియాతో కలిసి సూపర్బ్‌ స్టెప్పులు.. వైరల్‌ వీడియో

ఛమ్కీల అంగిలేసి సాంగ్‌ అయితే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు ఈ సాంగ్‌ను హమ్‌ చేస్తూ రీల్స్‌ చేస్తున్నారు. ఇప్పుడిదే పాటకు నాని సతీమణి అంజనా యెలవర్తి డ్యాన్స్‌ చేసింది.

Dasara: 'ఛమ్‌కీలా అంగీలేసి' పాటకు నాని సతీమణి డ్యాన్స్‌.. నజ్రియాతో కలిసి సూపర్బ్‌ స్టెప్పులు.. వైరల్‌ వీడియో
Nani Wife Anjana And Nazriya
Follow us
Basha Shek

|

Updated on: Mar 23, 2023 | 7:22 AM

న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన తాజా చిత్రం దసరా. మహానటి కీర్తి సురేశ్‌ కథానాయిక. సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. నేను లోకల్‌ సినిమా తర్వాత నాని, కీర్తి సురేశ్‌ మరోసారి ఈ సినిమాలో జంటగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఛమ్కీల అంగిలేసి సాంగ్‌ అయితే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు ఈ సాంగ్‌ను హమ్‌ చేస్తూ రీల్స్‌ చేస్తున్నారు. ఇప్పుడిదే పాటకు నాని సతీమణి అంజనా యెలవర్తి డ్యాన్స్‌ చేసింది. నటి నజ్రియాతో కలిసి క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో సాంగ్‌ను రీక్రియేట్ చేసింది. అనంతరం ఈ వీడియోను అంజనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

కాగా ఛమ్కీల అంగిలేసి పాటను కాసర్ల శ్యామ్‌ రాశారు. సంతోశ్‌ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. దీక్షిత అలియాస్ దీ అద్భుతంగా ఆలపించింది. ఈ పాటకు పాపులర్‌ కొరియోగ్రాఫర్‌ రక్షిత్‌ శెట్టి నృత్య రీతులు సమకూర్చాడు. ఈ సినిమాలో సాయికుమార్, స‌ముద్రఖని, జ‌రీనా వ‌హ‌బ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజనా, నజ్రియా స్టెప్పులేయడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో నాని ‘అంటే సుందరానికి’ సినిమా ప్రమోషన్‌ సాంగ్‌కు సూపర్బ్‌గా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?