- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu Wife Namrata Shirodkar Shares Paris Trip Photos With Daughter Sitara, Sister Shilpa
Mahesh Babu: ప్యారిస్ టూర్‌లో మహేశ్ ఫ్యామిలీ.. ఈఫిల్ టవర్ దగ్గర ఫొటోలు దిగుతూ..
మహేశ్ బాబు ఫ్యామిలీకి ట్రావెలింగ్ కొత్త కాదు. సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్తుంటారు. తన ట్రావెల్స్‌కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ప్రస్తుతం మహేశ్ ఫ్యామిలీ ప్యారిస్‌లో చక్కర్లు కొడుతోంది.
Updated on: Mar 25, 2023 | 2:08 PM

మహేశ్ బాబు ఫ్యామిలీకి ట్రావెలింగ్ కొత్త కాదు. సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్తుంటారు. తన ట్రావెల్స్‌కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ప్రస్తుతం మహేశ్ ఫ్యామిలీ ప్యారిస్‌లో చక్కర్లు కొడుతోంది.

మహేష్ బాబు సతీమణి నమ్రత, సితార ఇతర కుటుంబ సభ్యులు పారిస్ అందాలను ఆస్వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నమ్రత దీనికి 'గర్ల్స్ గ్యాంగ్' అనే క్యాప్షన్ ఇచ్చింది.

'సర్కారు వారి పాట' విజయం తర్వాత మహేశ్ బాబు కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే బిజీగా ఉంటున్నాడు మహేశ్. అందుకే అతను తప్ప ఇతర కుటుంబ సభ్యులు విదేశీ విహారయాత్రకు బయలు దేరారు.

ప్రస్తుతం మహేశ్ ఫ్యామిలీ ప్యారిస్ టూర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేశ్ కూడా ఉండిఉంటే బాగుండేదని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.