- Telugu News Photo Gallery Cinema photos Malayalam Actress Iswarya Menon got more offers in tollywood after spy movie telugu cinema news
Iswarya Menon: తెలుగు తెరపై సందడి చేయబోతున్న ఐశ్వర్య మీనన్.. అప్పుడే వరుస అవకాశాలతో బిజీ బిజీ..
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఐశ్వర్య మీనన్ ఒకరు. అందం, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ పడం 2 చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Updated on: Mar 25, 2023 | 1:10 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఐశ్వర్య మీనన్ ఒకరు. అందం, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ పడం 2 చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ మలయాళీ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా నాన్ సిరిత్తాళ్, వేళం, తమిళ్ యాంకర్స్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఐశ్వర్య.

ఇప్పటివరకు తమిళ్ ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య ఇప్పుడు తెలుగు తెరపై సందడి చేయబోతుంది. కార్తీకేయ 2, 18 పేజెస్ సినిమాలతో హిట్స్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్పై చిత్రంలో నటిస్తున్నారు.

కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఐశ్వర్య కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాలో తనకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అలాగే యంగ్ హీరో కార్తికేయ రాబోతున్న పాన్ ఇండియా చిత్రంలోనూ తాను హీరోయిన్ గా ఎంపికైనట్లుగా తెలిపారు. అలాగే మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించే విషయమైన చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.

మొత్తానికి తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే.. వరుస అవకాశాలు అందుకుంటూ అప్పుడే బిజీ అయిపోతుంది హీరోయిన్ ఐశ్వర్య.

తెలుగు తెరపై సందడి చేయబోతున్న ఐశ్వర్య మీనన్.. అప్పుడే వరుస అవకాశాలతో బిజీ బిజీ..




