AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? స్పెషల్‌ సాంగ్స్‌ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందండోయ్‌

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఓ ప్రముఖ నటి. ముఖ్యంగా స్పెషల్‌ సాంగులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. తల్లి వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది

Actress: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? స్పెషల్‌ సాంగ్స్‌ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందండోయ్‌
Actress
Basha Shek
|

Updated on: Mar 25, 2023 | 10:57 AM

Share

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఓ ప్రముఖ నటి. ముఖ్యంగా స్పెషల్‌ సాంగులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. తల్లి వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా మెప్పిస్తూనే స్పెషల్‌ సాంగులతో ఆకట్టుకుంది. స్టార్‌ హీరోల పక్కన ఆడిపాడి అదరగొట్టింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్‌, మలయాళ, కన్నడ భాష సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. కేవలం సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు స్మాల్‌ స్ర్కీన్‌పైనా తన ట్యాలెంట్‌ చూపించింది. పలు రియాల్టీ షోల్లో పాల్గొనడమే కాకుండా డ్యాన్స్‌ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. తనలోని కామెడీ ట్యాలెంట్‌కు బెస్ట్‌ ఫీమెల్‌ కమెడియన్‌ గా నంది పురస్కారాన్ని కూడా గెల్చుకున్న ఆమె మరెవరో కాదు.. ప్రముఖ నటి అభినయశ్రీ. తల్లి అనురాధ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె అల్లు అర్జున్‌ సినిమాలోని ‘అ అంటే అమలా పురం’ సాంగ్‌తో ఒక్క సారిగా ఫేమస్‌ అయిపోయింది.

నాగార్జున స్నేహమంటే ఇదేరా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అభినయశ్రీ. ఆతర్వాత ఆప్తుడు, శ్వేతనాగు, ఎవడిగోల వాడిది, యువకులు, హంగామా, భాగ్యలక్ష్మీ బంపర్‌ డ్రా, అత్తిలి సత్తిబాబు, ఆట, చందమామ, పైసాలో పరమాత్మ, మైఖేల్‌ మదన కామరాజు, ఏక్‌ నిరంజన్‌, పాండవులు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. పైసాలో పరమాత్మ సినిమాకు గానూ బెస్ట్‌ ఫీమెల్‌ కమెడియన్‌గా నంది పురస్కారం దక్కించుకున్న ఆమె మధ్యలో కాస్త గ్యాప్‌ తీసుకుంది. అయితే బిగ్‌బాస్‌-6తో బుల్లితెరపై అడుగుపెట్టింది. అయితే ఎక్కువ కాలం హౌస్‌లో ఉండలేకపోయింది. ప్రస్తుతం సినిమాలు చేయడం బాగా తగ్గించేసిన ఆమె సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటోంది. తన తల్లితో రీల్స్‌ చేస్తూ ఆ వీడియోలను నెటిజన్లతో షేర్‌ చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..