Avatar 2 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బిగ్గెస్ట్‌ విజువల్‌ వండర్‌.. అవతార్‌ 2 ప్రీ బుకింగ్ ఛార్జీలివే

ప్రీ బుకింగ్స్‌తోనే సంచలనాలు సృష్టించిన అవతార్‌ 2 బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 160 భాషల్లో రిలీజలైన ఈ సినిమా ఫుల్‌ రన్‌లో రెండు బిలియన్‌ డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ.16, 423 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Avatar 2 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బిగ్గెస్ట్‌ విజువల్‌ వండర్‌.. అవతార్‌ 2  ప్రీ బుకింగ్ ఛార్జీలివే
Avatar 2 Ott
Follow us
Basha Shek

|

Updated on: Mar 26, 2023 | 11:43 AM

హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన మరో విజువల్‌ వండర్‌.. ‘అవతార్‌- ది వే ఆఫ్‌ వాటర్‌ (అవతార్‌ 2)’. గతేడాది డిసెంబర్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రీ బుకింగ్స్‌తోనే సంచలనాలు సృష్టించిన అవతార్‌ 2 బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 160 భాషల్లో రిలీజలైన ఈ సినిమా ఫుల్‌ రన్‌లో రెండు బిలియన్‌ డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ.16, 423 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను మరో లోకం లోకి తీసుకెళ్లిన అవతార్‌ 2 ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఎదురుచూడసాగారు.ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ భారీ ధరకు కొనుగోలు చేసింది. మార్చి 28 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే మొదటగా రెంటల్‌ ప్రాతిపదికన ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కేవలం ఒకే ఓటీటీ వేదికపై కాకుండా పలు డిజిటల్ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ విజువల్‌ విండర్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ‘అవతార్‌ టీమ్‌ తాజాగా వెల్లడించింది.

మార్చి 28వ తేదీ ఉదయం 9.30గంటల నుంచి ‘అవతార్2’ స్ట్రీమింగ్ కానుంది. మూవీఎస్‌ ఎనీ వేర్‌, యాపిల్‌ టీవీ, ప్రైమ్‌ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. అయితే ఈ సినిమా చూడాలనుకున్న వారు ముందస్తుగా ఆర్డర్‌ చేసుకోవచ్చు. డిస్నీ మూవీస్‌ ఇన్‌సైడర్స్‌ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉంచారు. ఇంతకీ అవతార్‌ను చూడాలంటే ఎంత చెల్లించాలో తెలుసా? 19.99 అమెరికన్‌ డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1,600. ఒకసారి మూవీని ప్రీఆర్డర్‌ చేసిన తర్వాత 48 గంటల్లోగా క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. (యూకే, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ఉండేవారికి మాత్రం 14 రోజుల వెసులుబాటు ఉంది). అయితే సినిమా చూడడం, డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత క్యాన్సిల్‌ చేయడం కుదరదు. అవతార్‌ 2లో సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్ లాంటి అగ్రతారలు నటించారు. ఒక ఇండియాలోనే ఆరు భాషల్లో అంటే.. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైంది. ఇక వసూళ్ల విషయానికొస్తే.. ఇండియాలో 473 కోట్లకుపైగా గ్రాస్, 391 కోట్ల షేర్ నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..