Nagababu: ఆరెంజ్‌ రీ రిలీజ్‌ కలెక్షన్లపై నాగబాబు ఎమోషనల్‌.. రామ్‌చరణ్‌ విషయంలో ఆ బాధ తీరిపోయిదంటూ..

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా బాబాయి నాగబాబు నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ఆరెంజ్‌. బొమ్మరిల్లు భాస్కర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటించింది. 2010లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. చిరుత, మగధీర సినిమాలతో సక్సెస్‌ ట్రాక్‌లో ఉన్న చెర్రీకి ఆరెంజ్‌ అడ్డుకట్ట..

Nagababu: ఆరెంజ్‌ రీ రిలీజ్‌ కలెక్షన్లపై నాగబాబు ఎమోషనల్‌.. రామ్‌చరణ్‌ విషయంలో ఆ బాధ తీరిపోయిదంటూ..
Nagababu, Ram Charan
Follow us

|

Updated on: Mar 28, 2023 | 7:29 PM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా బాబాయి నాగబాబు నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ఆరెంజ్‌. బొమ్మరిల్లు భాస్కర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటించింది. 2010లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. చిరుత, మగధీర సినిమాలతో సక్సెస్‌ ట్రాక్‌లో ఉన్న చెర్రీకి ఆరెంజ్‌ అడ్డుకట్ట వేసింది. దీని తర్వాత మళ్లీ సినిమా చేయడానికి భాస్కర్‌కు ఏకంగా మూడేళ్లు పట్టింది. ఇక ఆరెంజ్‌ సినిమాతో నాగబాబుకు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. దీంతో చాలా కృంగిపోయానని ఒకానొకదశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపించిందని పలు సందర్భా్లో వాపోయారు. అయితే ఆరెంజ్‌ డిజాస్టర్‌గా మిగిలినప్పటికీ ఈ సినిమాకు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక ఈ మూవీ పాటలైతే ఇప్పటికీ వినపడుతుంటాయి. ఈక్రమంలోనే రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆరెంజ్‌ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఫస్ట్‌ టైం రిలీజ్‌ చేసినప్పటి కంటే రీ- రిలీజ్‌లో అదరగొట్టింది ఆరెంజ్‌ మూవీ. ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఆరెంజ్‌ సినిమా.. సుమారు రూ.75 లక్షల గ్రాస్‌ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కలెక్షన్లను చూసి నిర్మాత నాగబాబు తెగ సంబరపడిపోతున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ వీడియోను షేర్‌ చేసుకున్నారు.

‘చిరుత, మగధీర వంటి హిట్‌ సినిమాలతో జోష్‌లో ఉన్న రామ్‌చరణ్‌కి ఫ్లాప్ ఇచ్చాననే బాధ ఇన్ని రోజులు ఉండేది. ఈ సినిమాను రీ-రిలీజ్ చేద్దామంటే నేను కాస్త ఆలోచించాను. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకి గ్లోబల్ అవార్డు, ఆస్కార్ అవార్డు రావడంతో.. ఆ ఉత్సాహంతో ఆరెంజ్ ను రీ-రిలీజ్ చేద్దామనుకున్నాను. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్‌, వసూళ్లను చూస్తుంటే షాకింగ్ గా ఉంది. ఆరెంజ్ సినిమాకి ఇంతమంది అభిమానులున్నారా అని ఆశ్చర్యమేసింది. 2010లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఎవరికీ నచ్చలేదు. కానీ ఇప్పటి జనరేషన్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అందుకే ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆరెంజ్‌ను కూడా రామ్ చరణ్ హిట్‌ మూవీల్లో ఒకటిగా పరిగణించవచ్చు. నా వల్ల చరణ్ కి సక్సెస్ దూరమైందన్న బాధ నేటితో పోయింది. ఇదంతా రామ్‌చరణ్‌ వల్లే సాధ్యమైంది’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..